Vidadala Rajini : వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు మాజీ మంత్రి విడుదల రజిని చేతిలో ?
ప్రధానాంశాలు:
Vidadala Rajini : వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు మాజీ మంత్రి విడుదల రజిని చేతిలో ?
Vidadala Rajini : పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు, తన అనుచరుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సరైన మార్గాన్ని నిర్ణయించుకోలేక వైసీపీ అధినాయత్వం మల్లగుల్లాలు పడుతుంది. సుదీర్ఘ ఆలోచనలు, మంతనాల తర్వాత చాలా మంది నాయకులు, పార్టీ సభ్యులు కుల సమీకరణాలు మరియు కుటుంబ సంబంధాలను పరిగణనలోకి తీసుకోకుండా సోషల్ మీడియా క్రియాశీలతను సరైన చేతుల్లో ఉంచాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సోషల్ మీడియా వింగ్‌లో విడదల రజినీ తన సత్తా చాటుకోవడంతో చాలా మంది ఆమె పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన స్వంత ప్రొజెక్షన్ కోసం సోషల్ మీడియాను చక్కగా వినియోగించుకుంది. ఏ ప్లాట్‌ఫారమ్‌లోనైనా తనపై ప్రతికూల ప్రచారాలను ఎదుర్కోవడానికి నైపుణ్యతను ప్రదర్శించింది.
దాంతోనే ఆమె పార్టీలో గుర్తింపును పొందడం, మరియు చాలామంది సీనియర్ నాయకులను కాదని మంత్రి పదవిని కూడా దక్కించుకోవడం జరిగిందని అంతా అనుకుంటారు. కాబట్టి, సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతను ఆమె తీసుకోవడం ఉత్తమం అని పార్టీ క్యాడర్ ఆశిస్తుంది.వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనదే పైచేయిగా నిలిచింది. చివరకు అత్యంత కీలకమైన సోషల్ మీడియా ఇన్‌చార్జి పదవిలోనూ తన కుమారుడిని కూర్చోబెట్టారు. అయితే పార్టీ అధికారం కోల్పోవడం, సోషల్ మీడియా క్రీయాశీలకంగా వ్యవహరించడంలో విఫలం కావడం వంటి అంశాలతో ఇప్పుడు వైసిపి అధినాయకత్వం సోషల్ మీడియా ఇన్‌చార్జిగా సజ్జల భార్గవరెడ్డిని తప్పించాలని చూస్తున్నది.

Vidadala Rajini : వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు మాజీ మంత్రి విడుదల రజిని చేతిలో ?
సోషల్ మీడియాకు నాయకత్వం వహించడానికి వచ్చిన కొత్త ముఖాలు పార్టీ పట్ల ఎలాంటి సెంటిమెంట్‌ను కలిగి ఉండవని, అవసరమైన అభిరుచి మరియు గంభీరత లేకపోవడం మరియు తరచుగా జీతం కోసం మాత్రమే పని చేయడం వంటివి పార్టీ సభ్యులు గమనించారు. అందుకే, సోషల్ మీడియా బాధ్యతను విడదల రజినీ తీసుకోవాలని మెజారిటీ మంది కోరుతోంది. మరి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారో, ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.