Vidathala Rajini : జగన్ కు షాక్ ఇవ్వబోతున్న విడతల రజిని…!
ప్రధానాంశాలు:
Vidathala Rajini : జగన్ కు షాక్ ఇవ్వబోతున్న విడతల రజిని...!
Vidathala Rajini : నియోజకవర్గాల ఇన్చార్జి మార్పును వైయస్ జగన్మోహన్ రెడ్డి, వరుస పెట్టి చేస్తూ ఉండడం, వరుసగా జాబితాలను విడుదల చేస్తూ ఉండడం, ఒకటి కాదు రెండు కాదు దాదాపు 65 మంది ఎమ్మెల్యేలను మార్చడం , దాదాపు పదిమంది ఎంపీలను పార్టీ నుండి తొలగించడం ఏదైతే ఉందో దీనిలోంచి అసంతృప్తులు పుట్టుకొస్తున్నాయని చెప్పాలి. అయితే పార్టీ లో ఇలాంటివి పుట్టుకు రావడం అనేది చాలా సహజం. అయితే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు , ఎంపీలు రాజీనామా చేశారు, కొంతమంది జనసేన టిడిపిలకు వెళ్తుంటే మరికొందరు రాజకీయాలకే దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకటే అనిపిస్తుంది. ఓటు పడితే తనని చూసి ఓటు పడాలి లేకపోతే ఓటు పడకూడదు.మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మెన్స్ ఎమ్మెల్యేగాని ఎంపీలు గాని ఎవరు మధ్యలో ఉండకూడదు అనుకుంటున్నట్లు గా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత వ్యతిరేకమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు అనేవారు మన తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి మనల్ని రిప్రజెంట్ చేయడానికి మన తరపున మాట్లాడుతాడు.
లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన నిధులను సంపాదిస్తాడు. మన తరఫున ఉన్న సమస్యలకు ఆయన పోరాటం చేస్తాడు. ఎందుకంటే ఓటర్లు డైరెక్ట్ గా జగన్ కి వెళ్లి వారి సమస్యను చెప్పుకోలేరు కదా. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను ఒక తోలుబొమ్మలాగా పక్కన పెట్టేసి కేవలం జగన్ ని చూసి ఓటు వేయాలి అనుకోవడం కచ్చితంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విశ్లేషకులు అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఓపెన్ గానే జనాలకు ఓటు నాకే వేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలను కట్ చేసి పడేస్తున్నారు. అయితే ఇలా కట్ చేసిన ఎమ్మెల్యేలు చాలామంది రాజకీయాలు చేసుకోలేని పరిస్థితి లో ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే వివిధ నియోజకవర్గాలలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులను కూడా జగన్ తీసి పక్కన పెట్టారు. ముఖ్యంగా ఆర్కె ని తొలగించారు. దీంతో ఆర్కే వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఇప్పుడు షర్మిల తో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అయితే జగన్ కుటుంబానికి ఆర్కే ఎంత సన్నిహితంగా ఉండేవాడు మనందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తిని జగన్ పక్కన పెట్టాడు అంటే మిగతా వారిని అసలు పట్టించుకుంటాడా అనే అనుమానాలు పలువురికి వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే విడతల రజనీకి ఇలాంటి సమస్యలు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చిలకలూరిపేటలో ఐదు సంవత్సరాలుగా మంచి గ్రిప్ సాధించిన విడతల రజిని ఇప్పుడు జగన్ తీసుకెళ్లి గుంటూరులో పెట్టడం జరిగింది. ఇక ఆమెను అక్కడ నుండి పోటీ చేయాలని కోరారు.
అయితే విడతల రజిని ను చిలకలూరిపేటలో నిలబెడితే ఐదు సంవత్సరాలుగా తన నియోజకవర్గమైన చిలకలూరిపేటలో తాను నిలబెట్టుకున్న పేరు పరపతి , ద్వారా ఓట్లు పడతాయి కదా. ఇక గుంటూరు పశ్చిమ లో నాకు ఎవరు తెలుసు నేను ఎలా ఇక్కడ పోటీ చేయగలను అనే ఆలోచనలు విడతల రజిని కి ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే అక్కడ తన సొంత పార్టీ అభ్యర్థులు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని విడతల రజిని భావిస్తున్నట్లు సమాచారం. ఇక చిలకలూరిపేటకు తిరిగి వెళ్లిపోవాలంటే జగన్ ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనాప్పటికీ ఎన్నికలు సమీపించే లోగా తన బీఫామ్ ను చిలకలూరిపేట నుండి తెప్పించుకునే విధంగా విడుదల రజిని ప్రయత్నాలు చేస్తారని పోరాటం చేస్తారని కచ్చితంగా అర్థమవుతుంది.