
VSR : చెప్పుడు మాటలు విన్నంత వరకు జగన్ అక్కడే - విజయసాయి
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2గా చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎట్టకేలకూ మౌనం వీడారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోలేదని, త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నానని ఆయన స్పష్టం చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంపై విశ్లేషణ చేస్తూ జగన్ తిరిగి అధికారం చేపట్టడం అంత సులువు కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా ఉన్నంత కాలం మరియు జగన్ తన చుట్టూ ఉన్న ‘కోటరీ’ని నమ్ముకున్నంత కాలం వైసీపీకి అధికారం దక్కదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2020 నుంచి తనను ఉద్దేశపూర్వకంగా సైడ్‌లైన్ చేశారని, జగన్ కోటరీ మాటలను నమ్మి తనలాంటి విశ్వాసపాత్రుడిని దూరం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Vijayasai Reddy : చెప్పుడు మాటలు విన్నంత వరకు జగన్ అక్కడే – విజయసాయి
విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే, జగన్‌పై సునిశిత విమర్శలు గుప్పించారు. తాను జగన్ కోసం ఒక ‘పాలేరు’లా కష్టపడి పనిచేశానని, కానీ తనపై జగన్ చేసిన ప్రలోభాల ఆరోపణలు బాధించాయని ఆయన పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే, విశాఖపట్నంలో తనకు ఒక్క అపార్ట్‌మెంట్ తప్ప మరే ఆస్తులు లేవని స్పష్టం చేశారు. మద్యం స్కామ్ వంటి ఆరోపణలను తాను నమ్మబోనని చెబుతూనే, తనపై దుష్ప్రచారం చేసిన వారికి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పార్టీని వీడిన తర్వాత తన ప్రయాణం ఎటువైపు అనే విషయంలో ఇప్పటి వరకు గోప్యత పాటించిన సాయిరెడ్డి, ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
సాయిరెడ్డి తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు ఆయన మాటలే సమాధానం చెబుతున్నాయి. ఏ రాజకీయ పార్టీలో చేరనని పైకి చెబుతున్నప్పటికీ, బీజేపీ నుంచి ఆహ్వానం అందితే పరిశీలిస్తానని చెప్పడం ద్వారా తన మనసులోని మాటను బయటపెట్టారు. ఏపీలో కూటమిలో ఆయనకు చోటు దక్కడం కష్టమనే ప్రచారం ఉన్నప్పటికీ, ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయనకున్న పాత పరిచయాలు ఆయనకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. జగన్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఆయన, ఒకవేళ కమలం గూటికి చేరితే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవ్వడం ఖాయం. మొత్తానికి, విజయసాయిరెడ్డి రీ-ఎంట్రీ ప్రకటన వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది వేతన జీవులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పిఎఫ్ ఖాతాల్లో…
No Cost EMI : ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో మనకు తరచుగా వినిపించే ఆకర్షణీయమైన పదం 'నో కాస్ట్ ఇఎంఐ'…
Ex Lover : భర్త మహాశయులకు విజ్ఞప్తి..రోజు రోజుకు అక్రమ సంబంధాల కారణంగా భార్యల చేతుల్లో భర్తలు హతం అవుతున్నారు.…
Today Gold Rate : ఒకప్పుడు బంగారం ధరలు మాత్రమే పరుగులు పెట్టేది..కానీ ఇప్పుడు చైనా పుణ్యమా అని వెండి…
Lemongrass : ఒకప్పుడు ఇంటి చుట్టూ పెరిగే సాధారణ గడ్డిలా grass కనిపించిన నిమ్మగడ్డి (లెమన్ గ్రాస్) ఇప్పుడు ఆరోగ్య…
This website uses cookies.