Ys Jagan : జగన్ అత్యంత కీలక మీటింగ్.. అదే టార్గెట్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 August 2026, 6:30 pm
  •  Ys Jagan , డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్ల మధ్య వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారో తెలుసుకోండి.

Ys Jagan  : మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు కనిపిస్తోంది. ప్రశ్నపత్రం లీకేజీ, నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లతో నిర్వహించిన ర్యాలీలకు అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.డీఎస్సీ వ్యవహారంపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇప్పటికే స్పందించారు. ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని కూడా జగన్ కోరుతున్నారు.అదే సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన పలు అంశాలను జగన్ ప్రస్తావిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద బకాయి ఉన్న రూ.9,000 కోట్లను, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇంటింటికీ ఇచ్చిన బాండ్లలో, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నెలకు రూ.300 చొప్పున నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా చెల్లించాలని కోరుతున్నారు.

Ys Jagan : జగన్ అత్యంత కీలక మీటింగ్.. అదే టార్గెట్..!

Ys Jagan : జగన్ అత్యంత కీలక మీటింగ్.. అదే టార్గెట్..!

Ys Jagan  జగన్ అధ్యక్షతన కీలక సమావేశం.. తదుపరి పోరాటంపై చర్చ

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులు ఏ విధంగా పోరాటం కొనసాగించాలనే దానిపై జగన్ పలు సూచనలు చేయనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంపై భవిష్యత్‌లో చేపట్టాల్సిన నిరసనలు, ఆందోళన కార్యక్రమాల విషయంలో కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం.ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోవడానికి మరో కారణం త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు. ఈ నెల 17వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభలో ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలి, ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీయాలి అనే విషయాలపై కూడా జగన్ పార్టీ ప్రజాప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది.

Ys Jagan  మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎమ్మెల్సీలతో చర్చ

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నప్పటికీ, పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలికి క్రమం తప్పకుండా హాజరవుతున్నారని సమాచారం. దీంతో మండలిలో ప్రస్తావించాల్సిన కీలక అంశాలపై ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో ప్రస్తావించడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీఎస్సీ వ్యవహారం, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి వంటి అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.రాష్ట్రంలో రాజకీయంగా వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న సమయంలో జగన్ నిర్వహిస్తున్న ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే డీఎస్సీ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వైసీపీ.. ఇక అసెంబ్లీ, శాసన మండలి వేదికగా ఏ వ్యూహాన్ని అనుసరిస్తుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp