Chandrababu – Ys Jagan : సరిగ్గా ఇదే పాయింట్ చంద్రబాబుని జనం ముందు చులకన చేస్తోంది, జగన్ ని హీరో చేస్తోంది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu – Ys Jagan : సరిగ్గా ఇదే పాయింట్ చంద్రబాబుని జనం ముందు చులకన చేస్తోంది, జగన్ ని హీరో చేస్తోంది !

 Authored By kranthi | The Telugu News | Updated on :22 May 2023,10:00 am

Chandrababu – Ys Jagan : అసలు ఇప్పుడు ఏపీలో ఎంతమంది నిఖార్సయిన నాయకులు ఉన్నారు చెప్పండి. వేళ్ల మీద లెక్కబెట్టడమే. ఒకరు జగన్ అయితే మరొకరు చంద్రబాబు అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అసలు లీడరేనా? కాదా? అనే డౌట్ ప్రజలకు కాదు.. ఒక్కోసారి ఆయనకు కూడా అనిపిస్తుంది కాబోలు. అసలు.. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నేళ్లు అవుతోంది చెప్పండి. ఇప్పటి వరకు ఆయన పార్టీకి ఒక అతీ లేదు. ఒక గతీ లేదు.

ఓవైపు చంద్రబాబు, మరోవైపు జగన్.. ఇద్దరూ తమదైన శైలిలో రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. 70 ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ చంద్రబాబు ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి బలం వచ్చింది. ఒకప్పుడు లేని బలం ఇప్పుడు వచ్చిందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు అనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయకత్వంపై ఇప్పటికీ చాలామందికి నమ్మకం ఉంది.ఇక జగన్ గురించి మాట్లాడుకుంటే అతి చిన్న వయసులోనే కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేత ఆయన. 2014 లో ఓడిపోయినా కూడా ఏమాత్రం బెదరకుండా, అదరకుండా కష్టపడి పార్టీని నడిపించారు. 2019 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు.

what is the difference between chandrababu and ys jagan 2

what-is-the-difference-between-chandrababu-and-ys-jagan-2

Chandrababu – Ys Jagan: కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేత జగన్

ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరమే సమయం ఉండటంతో పార్టీలలో జంపింగ్స్ అనేవి కామన్. టీడీపీ నేతలు వైసీపీలో చేరొచ్చు. వైసీపీ నేతలు టీడీపీలో చేరొచ్చు. కానీ.. ప్రస్తుతం ఏపీలో అలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నవాళ్లు ఆ పార్టీకే ఫిక్స్ అయిపోయారు. ఎవరో ఒకరిద్దరు పార్టీలో రెబల్ గా మారితే వెంటనే వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం జగన్. వాళ్లు అధికార వైసీపీని వదిలేసి టీడీపీకి మద్దతు ఇవ్వడం వెనుక ఖచ్చితంగా చంద్రబాబు ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ ఒక్క విషయంలోనే చంద్రబాబు జగన్ ముందు చులకన అయిపోయారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి.. ఎన్నికల వరకు ఎలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకుంటాయో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది