Home » Andhra Pradesh » What Will Happen To Jumping Candidates In Politics
andhra pradesh

Jumping Candidates : ఏ పార్టీ టికెట్ ఇస్తామంటే ఆ పార్టీలోకి దూకుడు.. జంపింగ్‌ల ఫ్యూచరేంటి మరి?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 19, 2023, 12:00 pm
Advertisement

Jumping Candidates : రాజకీయాలు, ఉద్యోగాలకు సంబంధం ఉంటుంది. ఎలా అంటే.. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆ కంపెనీలో సరైన జీతం రాకపోయినా.. కంపెనీ సరిగ్గా చూసుకోకపోయినా వెంటనే మంచి ప్యాకేజీ ఇచ్చే కంపెనీలోకి జంప్ అవుతారు. అక్కడ కూడా సెట్ కాకపోతే మరో కంపెనీ.. లేదా పాత కంపెనీ.. ఇలా ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతూనే ఉంటారు. ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగులు ఇలా చేస్తుంటారు. సేమ్ టు సేమ్ రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతం అలాగే చేస్తున్నారు. కానీ.. ఉద్యోగం అనేది ఓకే.. జీతం కోసం ఎన్ని కంపెనీలు అయినా మారొచ్చు. కానీ.. రాజకీయం అలా కాదు కదా. రాజకీయం అనేది ఒక ఉద్యోగం కాదు. అది ఒక సామాజిక సేవ.

Advertisement

ఆ సేవ చేయడానికి పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీలో ఉన్నా ప్రజాబలం ఉంటే ఆ నేతకు మంచి క్రేజ్ ఉంటుంది. కానీ.. నేడు రాజకీయాలు చాలా ప్రాక్టికల్ అయిపోయాయి. అందుకే.. ఎక్కడ డబ్బు సంపాదించుకునే చాన్స్, పదవి దక్కే చాన్స్ ఉంటే అటు వెంటనే జంప్ కొట్టేస్తున్నారు రాజకీయ నాయకులు. అందుకే ఏపీలో జంపింగ్ జలానీలకు కొదవ లేదని చెప్పుకోవాలి. ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. ఆ తర్వాత ముచ్చట నడిపిద్దాం అనే ధోరణిలోనే రాజకీయ నాయకులు ఉన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేదు. ఏ పార్టీ అయినా సరే.. ఎక్కడ సరిగ్గా లేకున్నా వెంటనే జంప్ అవుతున్నారు.ఇక.. ఏపీ రాజకీయాల విషయానికి వస్తే.. 2019 ఎన్నికల తర్వాత ఓ నలుగురు ఎమ్మెల్యే వైసీపీ నుంచి టీడీపీకి రాగా.. టీడీపీ నుంచి మరో నలుగురు అన్నట్టుగా వైసీపీలోకి వెళ్లారు. వాళ్లు ఏదో చోటామోటా నేతలు అనుకుంటే పొరపాటే. వాళ్లంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు.

Jumping Candidates

Advertisement

Jumping Candidates : 2019 ఎన్నికల తర్వాత ఓ నలుగురు అటు.. ఓ నలుగురు ఇటు

వార్నీ.. వీళ్లంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయి ఉండి కూడా పార్టీలు మారారంటే ఎక్కడో తేడా కొట్టినట్టే కదా. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ వీళ్లు పోటీకి దిగుతున్నారు. మరి.. పార్టీ మారినందుకు ప్రజలు వీళ్లకు బుద్ధి చెబుతారా? ఈసారైనా ఇంట్లో కూర్చోబెడతారా? అనేది తెలియదు కానీ.. రాజకీయాల్లో ఇదంతా కామనే కదా.. అని జనాలు కూడా లైట్ తీసుకుంటారు కావచ్చు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి