YCP : వైసీపీలో అతన్ని ఓడించాలి అంటే తెలుగుదేశంలో ఒక్క మనిషి కూడా లేడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP : వైసీపీలో అతన్ని ఓడించాలి అంటే తెలుగుదేశంలో ఒక్క మనిషి కూడా లేడు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :30 July 2023,3:00 pm

YCP : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గుడివాడ ఆయన కంచుకోట. గుడివాడ నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ పార్టీతో సంబంధం లేదు. కొడాలి నానిని చూసి జనాలు ఓట్లేస్తారు. అసలు పార్టీతో సంబంధం లేకుండా కొడాలి నాని పేరును చూసి జనాలు అక్కడ ఓట్లు గుద్దుతారు. 2004 లో కొడాలి నాని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే వరకు గుడివాడలో రావి కుటుంబం రాజ్యమేలేది. కొడాలి నాని రాగానే.. ఆయనకు చాన్స్ దొరికింది. అప్పుడు ఆయన టీడీపీలో ఉండేవారు. టీడీపీ నుంచి రెండు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలి. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇప్పుడు ఐదో సారి గెలిచి రికార్డు సృష్టించడానికి కొడాలి రెడీ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. కానీ.. ఈ ఎన్నికలే ఇక నానికి చివరి ఎన్నికలు అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఐదో సారి గెలిచి రికార్డు క్రియేట్ చేసి.. ఆ తర్వాత 2029 ఎన్నికల్లో తన వారసులకు టికెట్లు ఇచ్చి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరో పదేళ్ల వరకు కొడాలి నానిని ఢీకొట్టే ప్రత్యర్థి లేడు. ఇప్పుడు కాదు.. ఇంకో పదేళ్లలో కూడా అలాంటి నాయకులు రాడు.

who will defeat kodali nani in gudivada from tdp party

who will defeat kodali nani in gudivada from tdp party

YCP : ఇప్పుడు కాదు.. మరో 10 ఏళ్ల వరకు కొడాలిని ఢీకొట్టేవాడు లేడు

కానీ.. గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలన్న పంతంలో టీడీపీ ఉంది. ఏపీలో అధికారంలోకి రావడం పక్కన పెడితే గుడివాడలో ఆయన్ను ఓడించాలని పట్టుబట్టింది టీడీపీ. అందుకే.. గుడివాడ నుంచి మాంచి నిఖార్సయిన నాయకుడిని బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది. ఎన్నారై వెనిగండ్ల రాము పేరును టీడీపీ పరిశీలిస్తోంది. ఆయనది కమ్మ సామాజిక వర్గం. ఆయన భార్యది ఎస్సీ సామాజికవర్గం. రెండు సామాజిక వర్గాలు కలిస్తే నానికి పెద్ద దెబ్బ వేయొచ్చు అనే ఉద్దేశంలో టీడీపీ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది