Nellore : నెల్లూరు రూరల్ లో గెలుపెవరిది.. కోటంరెడ్డి చరిత్ర సృష్టిస్తాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nellore : నెల్లూరు రూరల్ లో గెలుపెవరిది.. కోటంరెడ్డి చరిత్ర సృష్టిస్తాడా..?

Nellore  : ఏపీ రాజకీయాల్లో 175 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కానీ ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాలపై ఉంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర, రాజకీయ సమీకరణాలతో అవి ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాంటి వాటిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే నెల్లూరు రూరల్ లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నెట్టూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 May 2024,6:00 pm

Nellore  : ఏపీ రాజకీయాల్లో 175 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కానీ ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాలపై ఉంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర, రాజకీయ సమీకరణాలతో అవి ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాంటి వాటిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే నెల్లూరు రూరల్ లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నెట్టూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. దాంతో ఇప్పుడు అందరి చూపు ఈ నియోజకవర్గం మీద పడింది.

Nellore  రంగంలోకి మలిరెడ్డి బ్రదర్స్..

2014, 2019లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రెండు సార్లు 22 వేలు, 25 వేల మెజార్టీతో గెలిచారు. 2019లో గెలిచిన తర్వాత ఆయన వైసీపీతో విబేధాలతో టీడీపీలో చేరారు. ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని జగన్ సిట్టింగ్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ సారి రాజకీయ వ్యూహం మార్చారు. నియోజకవర్గంలో బలమైన పట్టు ఉన్న మలిరెడ్డి బ్రదర్స్ ను తనవైపుకు తిప్పుకున్నారు. దాంతో వారంతా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం సహకరించారు.

కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి అవినీతిని వారంతా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే కోటంరెడ్డి మాత్రం తాను నిత్యం ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యలు పరిష్కరించానని కాబట్టి వారే గెలిపిస్తారని ఆయన నమ్ముతున్నారు. ఇలా ఇద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ సారి గతంతో పోలిస్తే పోలింగ్ ఎక్కువగా నమోదైంది. అయితే ఈ పెరిగిన పోలింగ్ కాస్తా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే ఈ పెరిగిన పోలింగ్ గ్రామీణ ప్రాంతాల్లో నమోదైందే కాబట్టి అది తమకు కలిసి వస్తుందని చెబుతున్నారు ఆదాల ప్రభాకర్.

Nellore నెల్లూరు రూరల్ లో గెలుపెవరిది కోటంరెడ్డి చరిత్ర సృష్టిస్తాడా

Nellore : నెల్లూరు రూరల్ లో గెలుపెవరిది.. కోటంరెడ్డి చరిత్ర సృష్టిస్తాడా..?

ఇలా నెల్లూరు రూరల్ లో ఢీ అంటే ఢీ అన్నట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. కాగా కోటంరెడ్డిని ఓడించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. మరి జగన్ పట్టుదల గెలుస్తుందా లేదా కోటంరెడ్డి పంతం నెగ్గుతుందా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది