Ys Jagan : కేతిరెడ్డి లాంటి ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌కు కావ‌లి.. జ‌నాల్లో తిరిగే వాళ్ల‌కే టిక్కెట్ ఇస్తా.. జ‌గ‌న్ మాస్ వార్నింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : కేతిరెడ్డి లాంటి ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌కు కావ‌లి.. జ‌నాల్లో తిరిగే వాళ్ల‌కే టిక్కెట్ ఇస్తా.. జ‌గ‌న్ మాస్ వార్నింగ్‌..!

 Authored By sekhar | The Telugu News | Updated on :14 February 2023,12:09 pm

Ys Jagan : వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. ఈ ఎన్నికలలో గెలిస్తే ఇంకా దాదాపు 20… 30 సంవత్సరాలు వరకు వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదని వైసీపీ నేతలకు తెలియజేస్తున్నారు. చంద్రబాబుకి ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అని… కాబట్టి అందరూ కష్టపడాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు… ఇన్చార్జిలకు.. నిరంతరం ప్రజలలో ఉండేలా “గడపగడపకు మన ప్రభుత్వం” అనే కార్యక్రమం అప్పజెప్పడం జరిగింది.

who work like MLA Ketireddy i will gave ticket People want an those leaders

who work like MLA Ketireddy i will gave ticket People want an those leaders

రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం భారీ ఎత్తున ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారు. కానీ ఇటీవల 20 మంది ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లలేదని …గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించలేదని జగన్ దృష్టికి రావడంతో వాళ్ళందరికీ ఊహించని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లాగా.. పనిచేయాలి. ప్రజలకు అటువంటి నాయకుడు కావాలి. జనాల్లో తిరిగే వాళ్లకే టికెట్ ఇస్తా.. అంటూ జగన్ మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందట. వాస్తవానికి దాదాపు 15 సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజలలో ఉంటూ వస్తున్నారు.

who work like MLA Ketireddy i will gave ticket People want an those leaders

who work like MLA Ketireddy i will gave ticket People want an those leaders

పార్టీలకు.. ప్రాంతాలకు.. కులాలకు.. అతీతంగా నిరంతరం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు వింటూ.. ప్రతి సమస్యని పరిష్కరిస్తూ తనదైన శైలిలో… రాష్ట్రవ్యాప్తంగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యం కుటుంబం నుండి వచ్చిన గాని అక్కడ కూడా తన నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు లేకుండా.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పలు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ క్రమంలో.. నిన్న పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో.. కేతిరెడ్డి మాదిరిగా పనిచేయకపోతే ప్రజలలో ఉండకపోతే వచ్చే ఎన్నికలలో నో టికెట్ అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందంట.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది