Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కవర్ చేయలేక అడ్డంగా బుక్ అయ్యాడు పాపం.. నవ్వుకుంటున్న రాజకీయ విశ్లేషకులు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కవర్ చేయలేక అడ్డంగా బుక్ అయ్యాడు పాపం.. నవ్వుకుంటున్న రాజకీయ విశ్లేషకులు !

Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ తనను తాను కవర్ చేసుకోవడం కూడా చేతకాని వ్యక్తి. అవును.. ఆయన చేతగానితనాన్ని కూడా కవర్ చేసుకోలేకపోతే.. ఇక ఆయన రాజకీయాల్లో ఎలా రాణిస్తారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ఎందుకు పెట్టినట్టు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే కదా. కానీ.. 2014లో పార్టీ పెడితే ఆయన పోటీ చేసింది ఎప్పుడు.. 2019 ఎన్నికల్లో. అప్పుడు పోటీ చేస్తే గెలిచింది ఒక్క సీటు. ఇక అవన్నీ పక్కన పెడితే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 June 2023,12:00 pm

Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ తనను తాను కవర్ చేసుకోవడం కూడా చేతకాని వ్యక్తి. అవును.. ఆయన చేతగానితనాన్ని కూడా కవర్ చేసుకోలేకపోతే.. ఇక ఆయన రాజకీయాల్లో ఎలా రాణిస్తారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ఎందుకు పెట్టినట్టు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే కదా. కానీ.. 2014లో పార్టీ పెడితే ఆయన పోటీ చేసింది ఎప్పుడు.. 2019 ఎన్నికల్లో. అప్పుడు పోటీ చేస్తే గెలిచింది ఒక్క సీటు. ఇక అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు పవన్ అంతగా సుముఖత వ్యక్తం చేసే సీన్ కనిపించడం లేదు.

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే డౌటే. కానీ.. తెలంగాణలో పార్టీ క్యాడర్ ఉంది. బీజేపీతో జనసేనకు పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయొచ్చు. కానీ.. ఏనాడూ ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు అయితే లేవు. తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కానీ.. అసలు తెలంగాణ పోటీపై అంత సుముఖంగా ఉన్నారా అనేది స్పష్టం కావడం లేదు.

social media trolls on pawan kalyan politics and movies

social media trolls on pawan kalyan politics and movies

Pawan Kalyan : బీజేపీతో తెలంగాణలో పవన్ భేటీ అయ్యారా?

బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఏనాడైనా బీజేపీతో భేటీ అయ్యారా అంటే లేదనే చెప్పుకోవాలి. తెలంగాణ బీజేపీ నేతలతో ఏనాడూ భేటీ కాని పవన్ కళ్యాణ్.. తెలంగాణలో ఎలా పోటీ చేస్తారు. కానీ.. ఆయన తాజాగా కొన్ని నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్ చార్జ్ లను మాత్రం ప్రకటించారు. 26 నియోజకవర్గాలకు జనసేన ఇన్ చార్జ్ లను పవన్ ఎందుకు ప్రకటించారో అసలు ఆయనకు అయినా స్పష్టత ఉందో లేదో? నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లు అంటే జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందా? ఇన్ చార్జ్ లుగా నియమించిన ఆ 26 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. చూడాలి మరి.. ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించినా ప్రకటిస్తారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది