Chandrababu Bail : ఇక చంద్రబాబు జైలులోనే.. బయటికి రావడం చాలా కష్టం.. ఆశలు పెట్టుకోకండి.. అసలు నిజాలు చెప్పేసిన లాయర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Bail : ఇక చంద్రబాబు జైలులోనే.. బయటికి రావడం చాలా కష్టం.. ఆశలు పెట్టుకోకండి.. అసలు నిజాలు చెప్పేసిన లాయర్

 Authored By kranthi | The Telugu News | Updated on :26 October 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  పచ్చ చానెళ్లపై మండిపడ్డ లాయర్

  •  నా మీద బురద జల్లుతారా?

  •  మీకు దమ్ము ఉంటే నా చాలెంజ్ ను స్వీకరించండి

Chandrababu Bail : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేసి నెల రోజులు దాటింది. కానీ.. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాలేదు. అంతే కాదు.. ఆయన మీద స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మాత్రమే కాదు.. పలు ఇతర కేసుల్లోనూ చంద్రబాబు పేరు ఉండటంతో ఆయనకు బెయిల్ రావడం అసాధ్యం అయిపోయింది. ఏ ఒక్క స్కామ్ లో కూడా చంద్రబాబుకు బెయిల్ రాలేదు. కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు వెళ్లారు. కానీ.. ఏ కోర్టులో కూడా ఆయనకు బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు లాయర్లు.. ఇలా చాలామంది లాయర్లను కొన్ని కోట్లు పెట్టి తనకోసం వాదింపజేస్తున్నా.. ఏ కోర్టు కూడా చంద్రబాబు తరుపు లాయర్ల మాటలను వినడం లేదు. తాజాగా.. వైసీపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది సుధాకర్ రెడ్డి చంద్రబాబు బెయిల్ విషయమై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత దుర్మార్గం అంటే.. మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు ఆర్గ్యుమెంట్స్ చెప్పాను. ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు. కోర్టు నన్ను తిట్టినట్టు పలు మీడియా చానెళ్లలో టెలికాస్ట్ అవుతోంది. ఇంత దుర్మార్గమా.. ఈ పచ్చ మీడియా మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి.

వీళ్లకు రెండే పాలసీలు.. బుట్టలో వేసుకో లేకపోతే బురద జల్లు. ఈ రోజు సాయంత్రం వరకు నేను కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెబితే.. బయటికి రాగానే నామీద టెలికాస్ట్ చేస్తున్నారు. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం.. ఉంటుందా? సత్యం చెబుతారు.. నిజం చెబుతారు అని నేను ఏనాడూ అనుకోలేదు కానీ.. ఇంతలా దిగజారిపోతారు అని ఏనాడూ అనుకోలేదు. అక్కడ ఏం జరిగిందో ప్రూవ్ చేయడానికి నేను రెడీ. కోర్టు వారు నన్ను తిట్టినట్టు.. కోర్టు వారు నా మీద అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకుండా చేసుకుంటున్నారు. బురద జల్లుడు ఎందుకు.. ఇది చాలా తప్పు. వారు ఎవరో టెలికాస్ట్ చేసిన వాళ్లకు చెబుతున్నాను. మీరు రండి.. కోర్టు వారి ముందు నిలబడండి. నేను కోర్టులో ప్రూవ్ చేస్తాను. అది నిజం అయితే నేను ఏ శిక్షకు అయినా నిజం. అది అబద్ధం అయితే మీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా నా చాలెంజ్ ను తీసుకోండి. కోర్టు వారు నన్ను మందలించి ఉంటే రేపు రండి.. రుజువు చేసుకుందాం అంటూ సుధాకర్ రెడ్డి సవాల్ విసిరాడు.

Chandrababu Bail : నా డ్యూటీ నేను చేస్తున్నాను

నా డ్యూటీ నేను చేస్తుంటే పర్సనల్ గా మీరు నన్ను వేధిస్తున్నారు. చాలా తప్పు ఇది. మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు 11 గంటలకు కోర్టుకు రండి. ఇది పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తారు మీరు చెప్పండి. 5 గంటల వరకు నేను ఆర్గ్యూ చేశాను. ఎక్కడా కోర్టు వారు నా వాదనలకు అడ్డుపడలేదు. తేల్చుకుందాం రేపు రండి. ఆ చానెల్ లో చూపించింది నిజం అయితే నా చాలెంజ్ ను తీసుకోండి. మీకు భయపడకపోతే… బురద జల్లుతారా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు. మీరు ఎవరిని బదనాం చేయాలని అనుకుంటున్నారు.. అంటూ సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది