YCP Leaders : వైసీపీ నేతల వెనకడుగు వెనక రీజన్ ఇదేనా..?
YCP Leaders : ఐదేళ్లు పరిపాలన చేసి ప్రజల మెప్పు పొందితే మళ్లీ అదే పార్టీకి అధికారం ఇస్తారు ప్రజలు. ఒకవేళ ప్రజల తిరస్కరణ పొందితే మళ్లీ మన ఛాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం పరిపాలన మీద.. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల మీద చర్చించాల్సి ఉంటుంది. ఐతే ఏపీలో కూడా కూటమి మీద ఎదురుదాడికి వైసీపీ నేతలు అంతా సిద్ధం అవ్వాలని అనుకుంటున్నా ఎందుకో వెనకడుగు పడుతుంది. చంద్రబాబు సర్కార్ […]
ప్రధానాంశాలు:
YCP Leaders : వైసీపీ నేతల వెనకడుగు వెనక రీజన్ ఇదేనా..?
YCP Leaders : ఐదేళ్లు పరిపాలన చేసి ప్రజల మెప్పు పొందితే మళ్లీ అదే పార్టీకి అధికారం ఇస్తారు ప్రజలు. ఒకవేళ ప్రజల తిరస్కరణ పొందితే మళ్లీ మన ఛాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం పరిపాలన మీద.. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల మీద చర్చించాల్సి ఉంటుంది. ఐతే ఏపీలో కూడా కూటమి మీద ఎదురుదాడికి వైసీపీ నేతలు అంతా సిద్ధం అవ్వాలని అనుకుంటున్నా ఎందుకో వెనకడుగు పడుతుంది. చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేయాలి. ప్రజలకు ఏమి చేయట్లేదని ఎటాక్ చేయాలి. వైసీపీలో కొందరి భావన ఇది. కానీ ఇది ఇప్పుడే వద్దు అంటున్నాడట అధినేత్ జగన్. ఈమధ్య జగన్ మీడియా ముందుకొచ్చి చంద్రబాబు పాలన మీద విమర్శలు చేస్తూ మాట్లాడారు. ఐతే అధినేత మాట్లాడటం వరకు ఓకే కానీ పార్టీ నేతలు మాట్లాడటానికి జంకుతున్నారు. అధికారం లోకి వచ్చి రెండు నెలలే అవుతుంది ఈ టైం లో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని వారి మాట.
YCP Leaders కీలక నాయకుల సైలెన్స్ వెనక రీజన్..
అందుకే కూటమి ప్రభుత్వం మీద, బాబు మీద జగన్ ఒక్కడే ఎటాక్ చేస్తున్నాడు. పార్టీ కార్యకర్తలు, మీడియాలో అంతంత మాత్రంగానే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కనీసం గెలిచి 6 నెలలు కాకముందే అధికార పార్టీని విమర్శించడం కరెట్ కాదని కొందరి వైసీపీ నేతల భావన. సూపర్ సిక్స్ అమలుపై ప్రజలను పట్టించుకోవడం లేదని చంద్రబాబుని ప్రశ్నించాలని వైసీపీ నేతలపై ఒత్తిడి మొదలైంది.
కానీ ఎందుకో ఆ పార్టీ నాయకులు మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు స్పందిస్తున్నారు. జగన్ కూడా ఆరు నెలలు ఆగాకే అందరు మూకుమ్మడిగా ప్రజల సమస్యల మీద అధికార పార్టీతో పోరాడాలని అంటున్నారట. అందుకే నాయకులు కూడా ఈ మౌనాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి నాని, రోజాలు ఇప్పుడు సైలెన్స్ అయిపోయారు. ఐతే ఇప్పుడు వారు మాట్లాడితే బాబు కన్నుల్లో పడి తమ మీద ఫోకస్ చేస్తాడన్న భయం కూడా ఉందని తెలుస్తుంది.