Ys Jagan : ఓడిన ఐప్యాక్ టీంనే నమ్ముకున్న జగన్.. తీరు మారలేదంటూ వైసీపీ శ్రేణులు ఫైర్..!
Ys Jagan : ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 75 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎలక్షన్స్ ముగియగా, ఇందులో కూటమి ప్రభుత్వం భారీగా విజయం సాధించింది. దీంతో జగన్ ప్రభుత్వం డైలమాలో పడింది. ఈ ఎన్నికల్లో తాము గెలవబోతోన్నామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఆయన దీనికి సంబంధించిన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. […]
ప్రధానాంశాలు:
Ys Jagan : ఓడిన ఐప్యాక్ టీంనే నమ్ముకున్న జగన్.. తీరు మారలేదంటూ వైసీపీ శ్రేణులు ఫైర్..!
Ys Jagan : ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 75 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎలక్షన్స్ ముగియగా, ఇందులో కూటమి ప్రభుత్వం భారీగా విజయం సాధించింది. దీంతో జగన్ ప్రభుత్వం డైలమాలో పడింది. ఈ ఎన్నికల్లో తాము గెలవబోతోన్నామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఆయన దీనికి సంబంధించిన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. మండుటెండలు సైతం లెక్కచేయకుండా ఓటర్లు సునామీలా తరలివచ్చారని గుర్తు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అయిదు సంవత్సరాల పాటు కొనసాగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందంటూ జగన్ హమీ ఇచ్చారు.
నాయకుల ఆగ్రహం..
అయితే ఆయన ధీమాకి కారణం ఐప్యాక్. 2019లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో నడిచిన ఐ ప్యాక్ జగన్ గెలుపుకి గట్టిగానే కృషి చేసింది. అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ పక్కకి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో రుషి రాజ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో జగన్ కోసం కృషి చేసిన ఐప్యాక్ జగన్‌కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేకపోయింది.అయితే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఐప్యాక్ ఆఫీస్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. అప్పుడు, ఇప్పుడూ వైఎస్ఆర్సీపీ కోసం పని చేసింది ఐప్యాక్. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలకంగా ఉండగా, ఇప్పుడు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేష్ చందేల్.. డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.
వైనాట్ 175 నినాదంతో జగన్ జనాలలోకి భారీగా వెళ్లారు. కాని అది తేలిపోయింది. ఐ ప్యాక్ టీంని భారీగా నమ్ముకున్న జగన్ బోల్తా పడ్డాడు. ప్రతి ఎమ్మెల్యే వెనక కూడా ఐ ప్యాక్ టీం ప్రతినిధిని పంపాడు. అంతే కాదు వారి సర్వేల ఆధారంగా నాయకులకి నిలబెట్టాడు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తీరు, ఐ ప్యాక్ ప్రతినిధులు ప్రవర్తించిన విధానం పట్ల వైసీపీ శ్రేణులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులకి వాల్యూ ఇవ్వకుండా జగన్ ఐప్యాక్‌పైనే ఎక్కువ ఆధారపడడం పట్ల అందరు గుస్సాగా ఉన్నారు.