YS Jagan : మా అమ్మ చెల్లి ఫోటోలతో రాజకీయం చేస్తారా.. టీడీపీ పై జగన్ ఫైర్..!
YS Jagan : ఆస్తుల విషయంలో వైఎస్ జగన్ అతని చెల్లి షర్మిల Ys Sharmila మధ్య గొడవలు జరుగుతున్నాయన్న టాక్ ఉంది. ఐతే ఈ విభేదాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. ఐతే జగన్ Ys Jaganmohan reddy వీటిపై వారి మీద లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తల్లి విజయమ్మ షేర్లను షర్మిల పేరు మెద బదిలీ చేయించుకున్నారని వాటిని నిలుపుదల చేయాలంటూ జగన్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తనని జైలుకి పంపించి టీడీపీ […]
ప్రధానాంశాలు:
YS Jagan : మా అమ్మ చెల్లి ఫోటోలతో రాజకీయం చేస్తారా.. టీడీపీ పై జగన్ ఫైర్..!
YS Jagan : ఆస్తుల విషయంలో వైఎస్ జగన్ అతని చెల్లి షర్మిల Ys Sharmila మధ్య గొడవలు జరుగుతున్నాయన్న టాక్ ఉంది. ఐతే ఈ విభేదాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. ఐతే జగన్ Ys Jaganmohan reddy వీటిపై వారి మీద లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తల్లి విజయమ్మ షేర్లను షర్మిల పేరు మెద బదిలీ చేయించుకున్నారని వాటిని నిలుపుదల చేయాలంటూ జగన్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తనని జైలుకి పంపించి టీడీపీ TDP నేతల ద్వారా లబ్ధి పొందాలని షర్మీల్ చేస్తుందని వైసీపీ Ysrcp నేతలు ఆరోప్స్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా గుర్ల లో వైసీపీ కార్యకర్త మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. ఆ తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు. కేవలం టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అనవసరమైన విషయాలని తెర పైకి తెస్తున్నారని అన్నారు. కూటమి సర్కార్ ఎన్నికల హామీలన్నీ మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు.
YS Jagan డైవర్ట్ చేసేందుకే ఇలా..
టీడీపీ అక్రమాలన్ని బయటపడుతున్నాయని వాటిని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. ఐతే ఈసారి ఆమ్మ, చెల్లి ఫోటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఫ్యామిలీ ఇషూస్ అన్నీ రాజకీయం చేసి దాని ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారని జగన్ అన్నారు. డైవర్ట్ చేయడానికి తిరుమల లడ్డూ విషయాన్న్ని కొన్నాళ్లు తెచ్చారని. ఇప్పుడు ఫ్యామిలీ విషయాలను రాజకీయం చేస్తున్నారని అన్నారు.
అంతేకాదు ఈనాడు. ఏబీఎన్, టీవీ5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలని జగన్ అన్నారు. మీ ఫ్యామిలీల్లో గొడవలు ఉండవా.. నిజాల్ల్ని వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోండని జగన్ అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జగన్ అన్నారు. ఐతే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ మాత్రం జగన్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ని భారీగా ప్రమోట్ చేస్తూ తప్పు జగన్ దే అన్నట్టుగా హడావిడి చేస్తున్నారు.