Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్
ప్రధానాంశాలు:
Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఇటీవల లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్టవడంతో పార్టీలో భిన్న రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకుంది. చెవిరెడ్డి స్థానంలో తాత్కాలికంగా అలూరి సాంబశివారెడ్డిని అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలకు నియమించింది.

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్
Ys Jagan : లిక్కర్ కేసులో చెవిరెడ్డి బయటకు రాలేడని జగన్ ఫిక్స్ అయ్యాడా..? అందుకే ఈ పని చేశాడా..?
ఈ తాజా నియామకం పార్టీలో చర్చకు దారి తీసింది. అలూరి సాంబశివారెడ్డి నియామకాన్ని వైసీపీ తాత్కాలికమని పేర్కొన్నప్పటికీ, చెవిరెడ్డికి బెయిల్ త్వరగా వచ్చే అవకాశం లేదన్న సంకేతాలుగా పలువురు నేతలు భావిస్తున్నారు. ఇది లిక్కర్ కేసు సీరియస్‌గా వ్యవహారించబడుతోందన్న భావనకు బలాన్నిస్తుంది. అలూరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించడం వెనుక పార్టీ వ్యూహం ఉందని, ఎటువంటి గ్యాప్ లేకుండా కార్యకలాపాలు కొనసాగించేందుకు తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు.
ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానం భర్తీ చేయడం అలూరికి సులభం కాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చెవిరెడ్డి నెట్‌వర్క్, అనుభవం వేరు. అలూరి బాధ్యతల్ని ఎలా నెరవేర్చుతారు అనేది కీలకం కానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం లిక్కర్ కేసుపై ఎంతగా భయంగా ఉందొ తాజా పరిణామాలు చెప్పకనే చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.