YS Jagan : మోడీ – అమిత్ షా లకి నో అనలేని ఆఫర్ ఇచ్చిన వైయస్ జగన్..!
ప్రధానాంశాలు:
YS Jagan : మోడీ - అమిత్ షా లకి నో అనలేని ఆఫర్ ఇచ్చిన వైయస్ జగన్..!
YS Jagan : నరేంద్ర మోడీతో కలిసి ముందుకు వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు పోటీ పడే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి గత పది సంవత్సరాలుగా ఏపీకి న్యాయం చేయని మోడీని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ ఆశీస్సుల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు సాగిల పడుతున్నాయి. అయితే నరేంద్ర మోడీకి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాదనలేని ఆఫర్ ఇచ్చారట. ఏపీలో నరేంద్ర మోడీ సపోర్ట్ ఉంటే నిధుల సేకరణ గురించి అనేక అంశాల గురించి మంచి జరుగుతుందని 2014లో చంద్రబాబు నాయుడు చెప్పినట్లు 2019లో వైఎస్ జగన్ చెప్పారు. వీరిద్దరూ ఏపీకి ఏమాత్రం న్యాయం ఏం చేయలేదు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి నరేంద్ర మోడీ అండగా నిలబడితే ఏపీ ఎన్నికల సంఘం ఎన్నికలను సజావుగా చేసే వీలుంటుందని చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి బీజేపీ పొత్తు ఉంటే వైసీపీకి దెబ్బ పడుతుంది. ఇక ఇప్పుడు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని అంటున్నారు. రామ మందిరాన్ని నిర్మించి హిందువుల ఓటు బ్యాంకు వెనకేసుకున్న బీజేపీ కచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందని, ఈ తరుణంలో చంద్రబాబు నాయుడుతో నరేంద్ర మోడీ, అమిత్ షా పొత్తు పెట్టుకుంటే తనకు ఓటమి తప్పదని వైయస్ జగన్ భావిస్తున్నారు. అందుకే వైయస్ జగన్ ఎట్టి పరిస్థితిలో వీళ్ల పొత్తు కుదరకూడదని వాళ్లు నో అనలేని ఆఫర్స్ ఇచ్చారని తెలుస్తుంది. వైసీపీ మొదటి నుంచి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు.
కానీ గెలిచిన తర్వాత ఎన్నికల ముందు బీజేపీ లో చేరడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఢిల్లీ వెళ్లి వైయస్ జగన్ నరేంద్ర మోడీకి ఆఫర్ ఇచ్చారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దాంతోపాటు రాజ్యసభలో 11 ఎంపీ అభ్యర్థులను సాధించుకోగల ఘనత వైయస్ జగన్ కు ఉంది. టీడీపీకి ఒకటి కూడా సాధించుకునే పరిస్థితి లేదు. రాజ్యసభ తరపున 11 ఎంపీ అభ్యర్థులు బీజేపీ తరపున ఉంటాయని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ ను నరేంద్ర మోడీ ఒప్పుకోకపోతే రాజ్యసభలో 11 ఎంపి స్థానాలను కోల్పోతారు. ఈ తరుణంలో నరేంద్ర మోడీ, అమిత్ షా వైయస్ జగన్ ఇచ్చిన ఆఫర్ ను ఒప్పుకునే పరిస్థితి కనబడుతుంది.