Ys jagan : అంతా టెన్ష‌న్ టెన్షన్.. ప‌రిటాల గ‌డ్డ‌పై జ‌గ‌న్ అడుగుపెడుతుండ‌డంతో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys jagan : అంతా టెన్ష‌న్ టెన్షన్.. ప‌రిటాల గ‌డ్డ‌పై జ‌గ‌న్ అడుగుపెడుతుండ‌డంతో…!

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,2:00 pm

Ys jagan : ఏపీలో ఈ మ‌ధ్య రాజ‌కీయం చాలా వాడివేడిగా ఉంటుంది. ముఖ్యంగా అనంత‌పురం జిల్లాల‌లో ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే అక్క‌డ 2019లో మాత్ర‌మే వైసీపీకి ప‌ట్టు ద‌క్కింది. త‌ర్వాత కూట‌మి వైపే గాలి వీచింది. అయితే రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగమయ్య అనే బిసి నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. టిడిపి శ్రేణులే ఆయనను హత్య చేస‌న‌ట్టు చెబుతున్నారు.

Ys jagan అంతా టెన్ష‌న్ టెన్షన్ ప‌రిటాల గ‌డ్డ‌పై జ‌గ‌న్ అడుగుపెడుతుండ‌డంతో

Ys jagan : అంతా టెన్ష‌న్ టెన్షన్.. ప‌రిటాల గ‌డ్డ‌పై జ‌గ‌న్ అడుగుపెడుతుండ‌డంతో…!

Ys jagan టెన్షన్.. టెన్ష‌న్

అయితే కుటుంబ స‌భ్యుల‌ని క‌లిసేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌స్తున్నారు. అయితే అక్కడ‌ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడకు వెళ్తుండడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మొన్న ఆ మధ్యన పరిటాల సునీత స్పందించారు. పరిటాల రవి హత్యలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగల శక్తి తమకు ఉందని.. అటు నుంచి అట్టే హెలికాప్టర్లో పంపించగలమ‌ని కూడా ఆమె కామెంట్స్ చేశారు ఇప్పుడు టీడీపై జ‌గ‌న్ ఏమైన కామెంట్స్ చేస్తే రాజ‌కీయం మ‌రింత వేడెక్కే అవ‌కాశం ఉంది. రాప్తాడులో అయితే వైసీపీ వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది