Ys Jagan : జగన్ కాకపోతే వైసీపీ పగ్గాలు ఎవరికి.. హాట్ టాపిక్‌గా మారిన ఇష్యూ
ప్రధానాంశాలు:
Ys Jagan : జగన్ కాకపోతే వైసీపీ పగ్గాలు ఎవరికి.. హాట్ టాపిక్‌గా మారిన ఇష్యూ
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్, ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా లేకపోవచ్చు కానీ.. ఆయన రాజకీయ విశ్లేషణలను ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే జగన్ కేసుల విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయాలే ఇపుడు వైసీపీలోనూ చర్చకు తావిస్తున్నాయి. ఈ కేసులలో కనీసంగా రెండు నుంచి మూడేళ్ళ దాకా జగన్ కి శిక్ష పడవచ్చు అని అంటున్నారు.

Ys Jagan : జగన్ కాకపోతే వైసీపీ పగ్గాలు ఎవరికి.. హాట్ టాపిక్‌గా మారిన ఇష్యూ
Ys Jagan జగన్ పరిస్థితి ఏంటి ?
కనీసంగా రెండేళ్ళకు మించి శిక్షలు పడిన వారు ఎన్నికల్లో ఆరేళ్ళ పాటు పోటీకి అనర్హులు అని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే 2029 ఎన్నికల్లో జగన్ పోటీకి అనర్హులు అవుతారు అని అంటున్నారు.. ఇపుడు లిక్కర్ కేసు కూడా ముందుకు వస్తోంది. లిక్కర్ కేసు విషయంలో కూడా సీరియస్ గానే వ్యవహారం సాగితే ఇందులో సైతం జగన్ కి ఇరికిస్తే కనీసంగా రెండేళ్ళకు మించి శిక్షలు పడేలా ఉండొచ్చు అని అంటున్నారు.
2029 నాటికి వైసీపీ ఆశలు బలంగానే ఉన్నాయి. కానీ ఈ కేసుల చికాకు ఏమైనా అసలుకే ఎసరు తెస్తున్నా అన్న ఆందోళన కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కనుక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులలో పోటీకి దూరంగా ఉంటే ఆయన సతీమణి వైఎస్ భారతికి పగ్గాలు అప్పగిస్తారు అని చర్చ సాగుతోంది. ఆమెను ముందు పెట్టి రాజకీయం చేయవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైన ఏపీలో రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..