Vinukonda Rashid Murder : వినుకొండ హత్య విషయంలో చాలా సీరియస్‌గా ఉన్న జగన్.. హుటాహుటిన పల్నాడు జిల్లాకు మాజీ సీఎం
Vinukonda Rashid Murder : ఏపీలో ఇప్పుడు అరాచక పాలన నడుస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు, హత్యాకాండలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం.. నాయకులు, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో యాత్రకు సిద్ధమైతున్నట్టు కనిపిస్తోంది.
Vinukonda Rashid Murder మరో ఓదార్పు యాత్ర..
తాజాగా వినుకొండలో నడిరోడ్డుపై వైసీపీ నేత రషీద్ హత్య ఏపీలో సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ యువజన విభాగ నేత రషీద్ ని జిలాని అనే వ్యక్తి నడిరోడ్డు పై రెండు చేతులు నరికి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ హత్య ఘటన పైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని నడిరోడ్డుపై జరిగిన దారుణ మారణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ స్పందించిన జగన్ బెంగళూరు నుండి హుటాహుటిని ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు.ఈ రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు.

Vinukonda Rashid Murder : వినుకొండ హత్య విషయంలో చాలా సీరియస్‌గా ఉన్న జగన్.. హుటాహుటిన పల్నాడు జిల్లాకు మాజీ సీఎం
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు అతి కిరాతకంగా చంపిన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని, ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడం కోసమే వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు వినుకొండ వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ సంఘటనలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని జగన్ మండిపడుతున్నారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు