Ys jagan : ఏంటి.. కూటమి పవర్ మూడేళ్లేనా.. జగన్ లెక్కలపై అనుమానాలు
ప్రధానాంశాలు:
Ys jagan : ఏంటి.. కూటమి పవర్ మూడేళ్లేనా.. జగన్ లెక్కలపై అనుమానాలు
Ys jagan : ఏపీలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రం అయినా కేంద్రంలో అయినా ప్రజలు ఐదు సంవత్సరలకొకసా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మాజీ సీఎం జగన్ మరో మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆదుకున్నట్లుగా మరే ప్రభుత్వం ఆదుకోలేదని అన్నారు ఇంపుట్ సబ్సిడీతో పాటు వారి కోసం అనేక చర్యలను తీసుకున్నామని చెప్పారు.

Ys jagan : ఏంటి.. కూటమి పవర్ మూడేళ్లేనా.. జగన్ లెక్కలపై అనుమానాలు
Ys jagan ఎన్నికల సమయం..
కళ్ళు మూసుకుంటే ఏడాది గడచిపోయింది. ఇక మరో మూడేళ్ళు ఓపిక పట్టండి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జగన్ విపక్ష నేతగా హామీ ఇవ్వడంలో తప్పు లేదు. మరోసారి తాము అధికారమలోకి వస్తామని చెప్పుకోవడంలోనూ తప్పు లేదు కానీ ఈ మూడేళ్ళు గడువు ఏంటి అని అంతా అడుగుతున్నారు.
ఏపీలో 2024 మేలో ఎన్నికలు జరిగాయి. జూన్ లో ప్రభుత్వం కొలువు తీరింది. అంటే 2029 లోనే మళ్లీ ఎన్నికలు రావాల్సి ఉంది. జమిలి ఎన్నికలు 2028లో జరుగుతాయని అనుకున్నా ఆ దిశగా అయితే ఎవరికీ ఆశలు అయితే లేదు. జమిలి ఎన్నికలు అంటే అతి పెద్ద తతంగంగా ఉంటుంది. ఎన్నో అంశాలలో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. ఈ రోజున దేశంలో బీజేపీతో సహా ఎవరూ జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేయడం లేదు అని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలు పెడితే తెలంగాణాలో అధికారం మాదే అని భావిస్తున్న బీజేపీ కూడా 2028 చివరి దాకా వేచి చూడాలని అనుకుంటోంది. మూడేళ్ళే కూటమికి పవర్ అంటే లెక్కలలో ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు