YS Jagan : జగన్ పెద్ద స్కెచ్ వేసాడా.. టార్గెట్ బాబు మధ్యలో పవన్..!
YS Jagan : జనసేనాని పవన్ కళ్యాణ్ పదేళ్లపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎట్టకేలకి ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ సారి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక భాగం అయ్యారు. అయితే మొదటి నుండి వైసీపీకి వ్యతిరేఖంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీ నేతలు శత్రువుల కాదని, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని ఎవరు వాళ్లను ద్వేషించొద్దు, వాళ్లు చేసిన తప్పులు చేయొద్దు, నిజంగా వారితో గొడవ పడాల్సి వచ్చినపుడు మాత్రమే […]
ప్రధానాంశాలు:
YS Jagan : జగన్ పెద్ద స్కెచ్ వేసాడా.. టార్గెట్ బాబు మధ్యలో పవన్..!
YS Jagan : జనసేనాని పవన్ కళ్యాణ్ పదేళ్లపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎట్టకేలకి ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ సారి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక భాగం అయ్యారు. అయితే మొదటి నుండి వైసీపీకి వ్యతిరేఖంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీ నేతలు శత్రువుల కాదని, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని ఎవరు వాళ్లను ద్వేషించొద్దు, వాళ్లు చేసిన తప్పులు చేయొద్దు, నిజంగా వారితో గొడవ పడాల్సి వచ్చినపుడు మాత్రమే తీవ్రత చూపిద్దాం… పరుష పదజాలం వాడాల్సిన అవసరం కూడా లేదు, అవసరమైతే పదవులు పక్కన పెట్టి పోరాడేందుకు కూడా సిద్ధమేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పవన్ ఈ మధ్య వైసీపీ నాయకులని అంతగా విమర్శించడం లేదు,మరోవైపు వైసీపీ నాయకులు కూడా పవన్ ని టార్గెట్ చేయడం లేదు.
YS Jagan జగన్ ప్లాన్ ఇదా..!
పిఠాపురం వెళ్ళిన జగన్ పవన్ మీద గట్టిగానే విమర్సలు చేస్తారని అంతా భావించారు. ఎందుకంటే పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గం. పైగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మామూలుగా అయితే వైసీపీ పవన్ ని కూడా గట్టిగా టార్గెట్ చేసేదే. జగన్ పిఠాపురం వెళ్ళినా పవన్ ని పల్లెత్తు మాట అనకపోగా పాపం పవన్ అని సానుభూతి చూపించడంలో పరమార్ధం ఏమై ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఇక్కడ జగన్ సరికొత్త డ్రామా ఆడుతున్నాడని అందరు అనుకుంటున్నారు. అయితే రాజకీయంగా బాబుని ఒంటరిని చేసే మాస్టర్ ప్లాన్ లో ఇది భాగమని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో బీజేపీని పక్కన పెట్టి ఒక్క టీడీపీనే వైసీపీ విమర్శించేది. చివరికి టీడీపీ బీజేపీల మధ్య కటీఫ్ అయింది దాని ఫలితంగా వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. ఇపుడు కూడా అదే రకం స్ట్రాటజీని ప్లే చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.
అయితే జనసేన మాత్రం టీడీపీతోనే ఉంటుంది అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది. టీడీపీ బీజేపీల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చినా కూడా దాని ప్రభావం కచ్చితంగా జనసేన మీద కూడా పడుతుంది . అప్పుడు జనసేన వైసీపీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది.. పవన్ మీద విమర్శలు చేయకూడదు అన్నదే ఆ స్పష్టత. ఇప్పటికే మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ వైసీపీ ఏమీ అనకుండా జాగ్రత్త పడుతోంది. జనసేనను అలాగే ఉంచి టీడీపీని చంద్రబాబునే టార్గెట్ చేసుకోవాలని ఏపీ పాలనలో జరిగే లోపాలు ఆ తప్పులు తడకలూ అన్నీ కూడా బాబు ని ఇరకాటంలో పెట్టాలని వైసీపీ కొత్త స్కెచ్‌లు వేసిందంటూ కొందరు ముచ్చటించుకుంటున్నారు.