YS Jagan : జగన్ తోపుగాడు .. ఈ ఒక్క దెబ్బతో రుజువైంది !
YS Jagan : వైసీపీ అధినేత జగన్ నాయకత్వం విషయంలో ఎప్పుడూ కూడా తన మార్క్ చూపిస్తూ ఉంటారు. రాజకీయంగా ఎటువంటి పరిస్థితినైనా డీల్ చేయటంలో జగన్ తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక పరిపాలన పరంగా పేదలకు జగన్ అందిస్తున్న పథకాలు పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విషయంలో దిమ్మతిరిగే రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా జగన్ ఆరితేరిన అసలు సిసలైన రాజకీయ నేతగా దూసుకుపోతున్నారు. దేశంలో కుబేరులను సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించిన ముఖ్యమంత్రిగా ఇటీవల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది నాయకులు జగన్ నాయకత్వాన్ని చాలా సందర్భాలలో పొగడటం జరిగింది. ఇదిలా ఉంటే ఈనెల 28వ తారీఖు నాడు పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాని తప్పుపడుతూ 19 పార్టీలు.. ఈ కార్యక్రమాన్ని బాయ్ కట్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో నూతన పార్లమెంట్ భావన కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని 19 పార్టీలు బహిష్కరించడం పట్ల సీఎం జగన్ రియాక్ట్ అయిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి… హాజరుకావాలని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయం లాంటిదని… అది దేశం యొక్క ఆత్మను ప్రతిభం ఇస్తుందని అది దేశ ప్రజలకే కాదు అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభ కార్యక్రమాన్ని బహిష్కరించటం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని.. అన్ని రాజకీయ పార్టీలు విభేదాలన్నిటిని పక్కన పెట్టి పార్లమెంటరీ భవన ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని కోరారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ కూడా హాజరవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో ఒక మంచి కార్యక్రమానికి నిజంగా చాలా రాజకీయ పార్టీలు దూరం కావడం దురదృష్టకారం. అటువంటి సమస్య పట్ల జగన్ వారి నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ రీతిగా స్పందించటం గ్రేట్ అని సోషల్ మీడియాలో జనాలంటున్నారు.