Ys Jagan : ఆరోజు ఒక్క కొడాలి నానియే నా వెంట ఉన్నాడు సీఎం జగన్ ఎమోషనల్ కామెంట్స్..!!
Ys Jagan : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో కెరియర్ స్టార్ట్ చేసిన గాని..వైసీపీ పార్టీలో కొడాలి నానికి మంచి క్రేజ్ ఉంది. వైయస్ జగన్ నీ ఎవరు ఏమైనా అంటే ఊరుకునే వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ సొంతంగా రాజకీయం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి జగన్ కి మద్దతు తెలిపి అప్పటినుండి వైసీపీకి వీర విధేయుడిగా పనిచేస్తూ ఉన్నాడు.
ఒకానొక సమయంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిండు సభలో తాను నమ్మే వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి కొడాలి నాని అని చెప్పటం జరిగింది. రాజకీయంగా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో కొడాలి నాని నా వెంటే ఉన్నాడు.. అని తెలియజేశారు. కాగా ఇటీవల గుడివాడలో టీడ్కో ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా మరోసారి ఎమ్మెల్యే కొడాలి నాని పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
రాజకీయంగా కొడాలి నాని తనకెంతో దగ్గర ఉండే మనిషి అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని తన వద్ద వాపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అందిస్తున్న టిడ్కో ఇళ్లకు అదనంగా నాలుగువేల ఇల్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. జులై 8 వ తారీకు జరిగిన ఈ కార్యక్రమం వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.