YS Jagan Mohan Reddy : కొత్త సంవత్సరం వేళ చంద్రబాబుకి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Mohan Reddy : కొత్త సంవత్సరం వేళ చంద్రబాబుకి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!!

 Authored By anusha | The Telugu News | Updated on :2 January 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan Mohan Reddy : కొత్త సంవత్సరం వేళ చంద్రబాబుకి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!!

YS Jagan Mohan Reddy : కొత్త సంవత్సరం నాడు నాయకులకు రాజకీయంగా ముందుకు వెళ్లాలని ఉంటుంది. చాలామంది కూడా ఏదైనా పాజిటివ్ కోరుకుంటారు.అయితే ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి రాజకీయ శత్రువులు పెరిగిపోతున్నారు.కొత్త సంవత్సరం మొదటి రోజు పెన్షన్ల పెంపు చేస్తూ వాటి పంపిణీ చేస్తూ కొన్ని రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ జగన్ బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ వచ్చింది. తన సొంత చెల్లెలు వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఖరారు అయిపోయింది. అధికారికంగా అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. మూడో తారీకు ఈ అనౌన్స్మెంట్ రాబోతుంది. వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టబోతుంది. ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డికి నెగిటివిటీ అవుతుంది.

ఎందుకంటే ఏపీలో ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం వైసీపీ పార్టీ లోకి వచ్చేసింది. వైసీపీ పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంది. ఎప్పుడైతే ఆంధ్ర, తెలంగాణను విడదీసిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా చనిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో క్యాడర్ ఎంత ఎటు వెళ్లాలి అనుకుంటున్న టైంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో క్యాడర్ మొత్తం అతడి వైపు నిలబడింది. అయితే ఇప్పుడు ఐదేళ్లుగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు వై.యస్.షర్మిల కు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఆమె ఇప్పుడు ఎన్నికల్లో నిలబడతారా లేక వచ్చే ఎన్నికల్లో నిలబడతారా, 100 రోజు ఎలక్షన్స్ గ్యాప్ లోనే వై.యస్.షర్మిల ఏపీలోకి అడుగు పెడతారా అనేది తెలియదు కానీ కచ్చితంగా వై.యస్.షర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండి పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని,

షర్మిల కనుక కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి కచ్చితంగా కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ అవుతుంది. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి కచ్చితంగా ఇది బాడ్ న్యూస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలకు వంద రోజులు సమయం మాత్రమే ఉండడంతో ఎవరు గెలుస్తారు అనేదానిపై ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ సీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే జనసేన టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం వలన చాలావరకు టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం సంక్షేమ పథకాలతో దగ్గరైన వై.యస్.జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది