YS Jagan : కాకినాడ సభలో వై.యస్.షర్మిల గురించి ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసిన సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : కాకినాడ సభలో వై.యస్.షర్మిల గురించి ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసిన సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ..!!

YS Jagan ; మరో వంద రోజుల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి హోరాహోరి పోటీ ఉన్న క్రమంలో వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి అడుగు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఢిల్లీ వెళ్లిన షర్మిల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 January 2024,8:00 pm

YS Jagan ; మరో వంద రోజుల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి హోరాహోరి పోటీ ఉన్న క్రమంలో వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి అడుగు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఢిల్లీ వెళ్లిన షర్మిల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. షర్మిల తో పాటు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో కొందరు సిట్టింగ్లను వై.యస్.జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.

ఈ క్రమంలోనే సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాకినాడలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తన సోదరి వై.యస్.షర్మిల కాంగ్రెస్ లో చేరికను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని సీఎం జగన్ అన్నారు. అంతేకాదు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయని, పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, కుటుంబాలను చీల్చితారని, అబద్ధాలు చెబుతారని, మోసాలు చేస్తారని ఇవన్నీ జరుగుతాయని, మీరంతా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు జగన్ సూచించారు.

జగన్ తన ప్రసంగంలో కుటుంబాలను చీల్చితారంటూ వ్యాఖ్యానించడానికి బట్టి చూస్తే షర్మిల తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తారని పరోక్షంగా జగన్ విమర్శించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వై.యస్.షర్మిల ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే వైసీపీ పార్టీకే నష్టం జరుగుతుందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇదే విషయాన్ని కాకినాడ సభలో జగన్ పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇక ఇవాళ వై.యస్.షర్మిల కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొననున్నారు. వై.యస్.షర్మిల ఎవరి ఓట్లకు గండి పెడతారు అర్థం కాని పరిస్థితి. ఎన్నికలకు వందరోజుల సమయం మాత్రమే ఉన్న వై.యస్.షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి కూతురిగా ఏపీలో ఆమెకు కాంగ్రెస్ తరపున ఆదరణ దక్కుతుంది కానీ ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది