YS Sharmila : జగన్ సందేశాన్ని తీసుకొచ్చిన వైవి సుబ్బారెడ్డి కి షర్మిల ఇచ్చిన ఆన్సర్ ఇదే ..!!
ప్రధానాంశాలు:
YS Sharmila : జగన్ సందేశాన్ని తీసుకొచ్చిన వైవి సుబ్బారెడ్డి కి షర్మిల ఇచ్చిన ఆన్సర్ ఇదే ..!!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో మరో వంద రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. వైయస్సార్ సీపీ ని ఎలాగైనా ఓడించాలని కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంత హోరాహోరీగా పోటీ నడుస్తున్న క్రమంలో వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టారు. దీంతో ఏపీలో సెన్సేషనల్ గా మారింది. ఇక వై.యస్.షర్మిల వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాజకీయపరంగా దెబ్బలాడుకునే పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు. గతంలో వై.యస్.షర్మిల తెలంగాణలో వైయస్సార్ టీపీని స్థాపించారు. అంతకుముందు వై.యస్.షర్మిల జగన్ కు పోటీగా కాంగ్రెస్ పార్టీ పెడతారని అనుకున్నారు.
ఎందుకంటే వారి మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయని, అందుకే వై.యస్.షర్మిల జగన్ కి దీటుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని రాజకీయ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. అయితే ఇది ఆపడం కోసం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వై.వి సుబ్బారెడ్డి, కెవీపీ వాళ్ళను పంపించారు అంటూ తెలుగుదేశానికి సంబంధించిన మీడియా వైరల్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ గొడవలను ఏపీ రాజకీయాల్లో మరల్చవద్దని, ఇది చంద్రబాబు నాయుడు కి బెనిఫిట్ అవుతుంది తప్ప వై.యస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అవుతుందని, ఫ్యామిలీ విషయాలను రాజకీయాల్లో తీసుకువస్తే ప్రజలకు చులకన అవుతామని, వై.యస్.షర్మిల వైసీపీలోకి వస్తే కడప ఎంపీ సీటు ఇస్తామని జగన్ సందేశాన్ని సుబ్బారెడ్డి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది.
వై.యస్.షర్మిల మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని రాజకీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. జగన్ పంపిన సందేశాన్ని వై.యస్.షర్మిల రిజెక్ట్ చేశారని, తాను ఏపీలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీకి కేవలం ప్రచారకర్తగా ఉంటానని, తద్వారా రాజ్యసభ సీటును పొంది కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ రాజ్యసభ సీటు పొంది ఢిల్లీ వెళ్లి ఎంపీ అయి ఉద్దేశంలో ఉన్నానని, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను తీసుకోవడం లేదని వై.యస్ .షర్మిల వైవి సుబ్బారెడ్డి కి తెలియజేశారు. దీంతో వై.ఎస్.షర్మిల ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారారు. ఎన్నికలకు వందరోజుల సమయం మాత్రమే ఉండడంతో అనేశయంగా కాంగ్రెస్ లోకి వైయస్ షర్మిల రావడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.