YS Sharmila : వై.యస్.షర్మిలా…. క్షమాపణ చెప్పి ఏపీలో అడుగుపెట్టు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : వై.యస్.షర్మిలా…. క్షమాపణ చెప్పి ఏపీలో అడుగుపెట్టు..!!

వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టేముందు ప్రజలకి క్షమాపణ చెప్పాలి.అందుకు రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను విడదీసిన పాపం కాంగ్రెస్ కి చెందుతుంది. గతంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించి కాంగ్రెస్ కి దూరం చేసింది. దీంతో ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో ఒకటి శాతం కంటే తక్కువ శాతానికి కాంగ్రెస్ పడిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి క్షమాపణ చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పదవి చేపడుతున్న […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 January 2024,1:00 pm

వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టేముందు ప్రజలకి క్షమాపణ చెప్పాలి.అందుకు రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను విడదీసిన పాపం కాంగ్రెస్ కి చెందుతుంది. గతంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించి కాంగ్రెస్ కి దూరం చేసింది. దీంతో ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో ఒకటి శాతం కంటే తక్కువ శాతానికి కాంగ్రెస్ పడిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి క్షమాపణ చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పదవి చేపడుతున్న వై.యస్.షర్మిల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరి తరపున ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అడ్డగోలుగా విభజించామని కాంగ్రెస్ తప్పును ఒప్పుకోవాలి. ఏపీలో పుంజుకోవాలన్న ఓటు బ్యాంకు కావాలన్నా ఏపీకి కచ్చితంగా క్షమాపణలు చెప్పాలి.

రెండవది వై.యస్.షర్మిల గతంలో మా అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి గొప్ప అని తోపు అని మా అన్నను గెలిపించండి…రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది..చంద్రబాబు దిగిపోతే మా అన్న అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తామని చెప్పిన వై.యస్. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరి తన అన్న జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు. ఇది పెద్ద అన్యాయమైన అంశం. నా అన్నను గెలిపించండి అంటూ ఊరు తిరిగిన వై. ఎస్. షర్మిల ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా దిగుతున్నారు. ఇది కచ్చితంగా వై.యస్.షర్మిల చేసిన పెద్ద తప్పు. గతంలో తన అన్నకు ఓటెయ్యండి అని అడిగిన షర్మిల ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా నిలబడటం ఏమాత్రం సరికాదు. ఈ రెండు అంశాల్లో వై.యస్.షర్మిల ఏపీ ప్రజలకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలి.

రెండు అంశాల్లో వై.యస్.షర్మిల ఏపీ ప్రజలకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో చోట్ల రోడ్లు లేవు ఉద్యోగాలు కూడా లేవు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వై.యస్.షర్మిల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వై.యస్.షర్మిల వై.యస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడటం సరైనది కాదు. కుటుంబంలో ఉన్న విభేదాలను ఇలా రాజకీయాలలో చూపించడం ఏమాత్రం సరి కాదని అంటున్నారు. ఎన్నికల్లో వై.యస్.షర్మిల ప్రభావం అంతగా లేకపోయినా కూడా అది వై.యస్.జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరుతుంది. వైసీపీలో టికెట్లు దక్కని వాళ్లంతా కాంగ్రెస్లోకి చేరే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇది వై.యస్. జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది