
Ys sharmila : నీ చెల్లి పవర్ ఏంటో చూపిస్తా జగనన్న...వైయస్ షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్...!
Ys sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైయస్ షర్మిల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిందో అప్పటినుండి తన అన్న జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతి బహిరంగ సభలో ఆయన గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక భారీ బహిరంగ సభలో ప్రస్తావించిన వై.యస్ షర్మిల తన అన్న జగన్ మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేయడం జరిగింది. వాటిలో 12 ప్రాజెక్టులను రాజశేఖర్ రెడ్డి గారే పూర్తి చేశారు. వాటిలో ఇంకా 42 ప్రాజెక్టు లు అలాగే మిగిలిపోయాయని వాటన్నిటిని కూడా అధికారంలోకి వస్తే పూర్తి చేస్తానని మాట ఇచ్చిన జగనన్న గారు ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారో సమాధానం ఇవ్వాల్సిందిగా షర్మిల ప్రశ్నించారు.
కనీసం జగనన్న వాటిలో 10 ప్రాజెక్టులు కూడా చేయలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు దానికంటే చిన్నవైన ఇంకా చాలా ప్రాజెక్టు అలాగే ఉండిపోయాయి. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని జగనన్న గారు , మాట ఇచ్చి నెరవేర్చుకోలేని జగనన్న గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు ఎలా అవుతారు అని షర్మిల హేద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగనన్న గారు ఎలా నిలబెడుతున్నారు సమాధానం చెప్పాల్సిందిగా వై.యస్ షర్మిల ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి మధ్యపాన నిషేధమని చెప్పి జగనన్న అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు తన సొంత బ్రాండ్లను మద్యపానంగా చేసి అమ్ముతున్నాడని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనని చెప్పిన జగనన్న ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నాడు అంటూ వైయస్ షర్మిల కామెంట్ చేశారు. ఇక మ్యానిఫెస్టో అంటే తనకు భగవద్గీత కురాన్ అని చెప్పిన జగనన్న తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాటన్నింటినీ ఎందుకు చేయలేకపోయాడు అంటూ ప్రశ్నించారు. సర్కారే మందు అమ్ముతూ మళ్లీ దానికి డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు మాత్రమే తీసుకుంటూ మందు అమ్ముతూ వస్తున్నారు. ఎలాంటి డిజిటల్ పేమెంటు లేకుండా సర్కార్ మందు అమాల్సిన అవసరం ఏముంది అంటూ షర్మిల ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ మధ్యపానానికి కట్టాల్సిన టాక్స్ కడుతున్నారో లేదో ఏ విధంగా తెలుస్తుంది అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలా తప్పులు మీద తప్పులు చేస్తూ జగనన్న గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతు కోస్తున్నారని , అందుకే నేను నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరి నా ప్రజల కోసం కొట్లాడుతున్నానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
అదేవిధంగా ప్రత్యేక హోదా ఏమైంది అని, పోలవరం ప్రాజెక్టు ఇంకా ఎందుకు కట్టలేదని , అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అని నేను అడుగుతుంటే సొంత చెల్లిని అని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు ఆయన అనుచరులు. ఇదెక్కడి న్యాయమని అడుగుతున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఏ పార్టీలోనైనా చేరే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అంటూ ఆమె ప్రశ్నించారు. ఒకప్పుడు ఇదే చెల్లెలు 3 వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్న కోసం పార్టీ ని నడిపించింది. ఒకప్పుడు ఇదే చెల్లెలు సమైకాంధ్ర కోసం ఒక యుద్ధం చేసింది. ఇదే చెల్లెలు తెలంగాణ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేసింది . ఇదే చెల్లెలు గతంలో “బాయ్ బాయ్ బాబు ” అనే క్యాంపెయిన్ నడిపి చంద్రబాబును గద్దె దించింది. అలాంటి చెల్లిని ఈరోజు వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో షర్మిల కొత్త తరహా రాజకీయ పరిణామాలను తీసుకొచ్చేలా కనిపిస్తుంది. మరి వై.యస్ షర్మిల రాజకీయ ప్రస్తావన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.