Ys Sharmila ఆస్తులని మించి జగన్‌ని షర్మిళ అలాంటి దెబ్బ కొట్టిందా ?
ప్రధానాంశాలు:
Ys Sharmila ఆస్తులని మించి జగన్‌ని షర్మిళ అలాంటి దెబ్బ కొట్టిందా ?
Ys Sharmila : జగన్ ,షర్మిల ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. షర్మిల లేఖతో మొదలైన ఈ రచ్చలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తున్నాయి. ఆస్తుల వివాదంలో జగన్ మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడుతుండగా, షర్మిలకు అనుకూలంగా విజయమ్మ అండ్ కో మాట్లాడుతున్నారు. ఇలా జగన్,షర్మిలపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. షర్మిళకి . ఆమెకు మద్దతుగా తల్లి విజయమ్మ రాసిన లేఖ ఘన చరిత్ర కలిగిన వైఎస్ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. అంతకు మించి జగన్ కు నష్టం చేస్తున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న వైఎస్ కుటుంబం రచ్చకెక్కడం వల్ల రాజకీయాల పరంగా, ఆస్తుల పరంగా, పరపతి పరంగా నామమాత్రంగా ఉన్న షర్మిల కంటే వైఎస్ జగన్ కు తీవ్ర నష్టంగా మారబోతున్నాయి.
Ys Sharmila వరుస సమస్యలు..
షర్మిలతో ఆస్తుల వివాదాన్ని జగన్ రాజీ చేసుకోవచ్చు. కానీ గత ఎన్నికల్లో, ఆ తర్వాత షర్మిల ఆయనకు చేసిన నష్టం రాజకీయంగా, మానసికంగా ఎప్పటికీ తీరేది కాదు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా అడుగులు ఎటు వేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న జగన్ కు ఇప్పుడు చెల్లెలు రూపంలో మరింత నష్టం చేకూరుతుంది.. అదీ మహిళల విషయంలో జగన్ వైఖరి జనంలో రోజూ చర్చనీయాంశం అవుతోంది. దీంతో భవిష్యత్తులో దీన్ని కవర్ చేసుకోవడం జగన్ కు కష్టం కావచ్చనే అంచనాలున్నాయి. షర్మిలను కాదని జగన్ ను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్దంగా లేదు. అందుకే కూటమి సర్కార్ దాడులపై ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ కు ఇండియా కూటమి పక్షాలు సంఘీభావం ప్రకటించినా కాంగ్రెస్ దూరంగా ఉండిపోయింది.
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ తీరు మారిందని ఇటీవల బ్రదర్ అనిల్ ఆరోపించారు. ఏపీలో మతతత్వ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారని అనిల్ బాంబ్ పేల్చాడు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో సువార్త సభలు పెట్టాలని బ్రదర్ అనిల్ అనుకున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం దీనికి అనుమతి నిరాకరించాడని అనిల్ చెప్పాడు. వైఎస్ మరణం తర్వాత షర్మిల , తాను జగన్ కు అడుగడుగునా రాజకీయంగా అండగా ఉన్నామని అనిల్ చెప్పుకొచ్చాడు. అంతే కాదు 2019లో జగన్ సీఎం అవడానికి తన ప్రార్థనలు కారణమని అనిల్ అన్నాడు. అలాంటి తన మీటింగ్ లను ఏపీలో వద్దని జగన్ చెప్పడంతో నేను షాక్ గురయ్యాను అని అనిల్ మీడియాతో అన్నాడు. తన మీటింగ్ లతో బీజేపీ పెద్దలకు కోపం వస్తుందనే జగన్ మీటింగ్ లు వద్దన్నాడని అనిల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇలా జగన్‌ని దోషిగా అందరు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.