YS Sharmila : సోనియమ్మతో వైఎస్ షర్మిల ఒప్పందం.. తెలంగాణ వదిలేసిన నేరుగా ఏపీపై గురి.. జగనే టార్గెట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : సోనియమ్మతో వైఎస్ షర్మిల ఒప్పందం.. తెలంగాణ వదిలేసిన నేరుగా ఏపీపై గురి.. జగనే టార్గెట్..?

 Authored By kranthi | The Telugu News | Updated on :9 August 2023,4:00 pm

YS Sharmila : చాలా రోజుల నుంచి ఈ విషయం గురించి చర్చలు నడుస్తున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇక తెలంగాణను వదిలేసి ఏపీకి వెళ్లబోతున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే.. వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పెట్టారు. కొన్ని రోజులు హడావుడి చేశారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. తెలంగాణ ప్రజలు నిక్కచ్చిగా ఆమెను పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా గెలిచే అవకాశాలు అయితే లేవు. కనీసం ఒక్క సీటు అయినా ఆమె గెలుస్తుందా అంటే డౌటే.

అందుకే.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలపాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఆమె ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. నేరుగా సోనియా గాంధీ తోనే వైఎస్ షర్మిల ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసే విషయం చాలా రోజుల కిందనే చర్చనీయాంశం అయింది కానీ.. తను ఏపీకి వెళ్లనని.. తను ఏం చేసినా తెలంగాణలోనే.. తెలంగాణ కోసమే అని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ.. ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.అందుకే.. తెలంగాణ నుంచి రూట్ మార్చి ఏపీ వైపు తన గురిని పెట్టేందుకు వైఎస్ షర్మిల సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన కండిషన్లు అన్నింటికీ ఓకే చెప్పి చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ys sharmila to merge her party in congress

ys sharmila to merge her party in congress

YS Sharmila : అందుకే ఏపీ వైపునకు గురి

డీకే శివకుమార్ తో సమావేశం తర్వాత ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాకపోతే తెలంగాణలో ఆమె పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరుపున షర్మిలకు పాలేరులో టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక.. అన్నీ ఓకే అయితే అధికారికంగా సోనియా గాంధీ సమక్షంలో వైఎస్సార్టీపీ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. అలాగే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే.. అక్కడ సీఎం జగన్ తన అన్నకే వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరుపున షర్మిల ప్రచారం చేయనున్నారన్నమాట. చూద్దాం మరి వైఎస్సార్ కూతురుగా, ఆయన వారసురాలిగా వైఎస్ షర్మిల ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో?

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది