Home Minister Anitha : రెడ్ బుక్ ప్ర‌కారం పోతే వైసీపీ వాళ్లు రోడ్ల‌పై తిరుగ‌లేరు : ఏపీ హోంమంత్రి అనిత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Home Minister Anitha : రెడ్ బుక్ ప్ర‌కారం పోతే వైసీపీ వాళ్లు రోడ్ల‌పై తిరుగ‌లేరు : ఏపీ హోంమంత్రి అనిత‌

 Authored By prabhas | The Telugu News | Updated on :1 March 2025,1:02 pm

ప్రధానాంశాలు:

  •  Home Minister Anitha : రెడ్ బుక్ ప్ర‌కారం పోతే వైసీపీ వాళ్లు రోడ్ల‌పై తిరుగ‌లేరు : ఏపీ హోంమంత్రి అనిత‌

Home Minister Anitha : తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేని ఏపీ హోంమంత్రి అనిత Home Minister Anitha అన్నారు. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వైసీపీ నేత‌ గోరంట్ల మాధవ్ Gorantla Madhav అన్న వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. శ‌నివారం ఆమె విజయవాడ Vijayawada లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదన్నారు. వైసీపీ YCP లో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని సూచించారు.

Home Minister Anitha రెడ్ బుక్ ప్ర‌కారం పోతే వైసీపీ వాళ్లు రోడ్ల‌పై తిరుగ‌లేరు ఏపీ హోంమంత్రి అనిత‌

Home Minister Anitha : రెడ్ బుక్ ప్ర‌కారం పోతే వైసీపీ వాళ్లు రోడ్ల‌పై తిరుగ‌లేరు : ఏపీ హోంమంత్రి అనిత‌

Home Minister Anitha పోసాని వ్యాఖ్య‌లు క్ష‌మించ‌రాని త‌ప్పు

పోసాని అరెస్ట్‌పై ఆమె స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 17 కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు. గతంలో మంత్రి నారా లోకేశ్ Nara Lokesh, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pavan Kalyan కుటుంబంపై పోసాని చేసిన వ్యాఖ్యలు క్షమించరాని తప్పన్నారు. తమ ప్రభుత్వం క్షక్షపూరిత రాజకీయాలు చేయడం లేదన్నారు. రెడ్ బుక్ ప్ర‌కారం పోతే వైసీపీ నాయ‌కులు రోడ్ల‌పై తిరుగ‌లేర‌న్నారు.

గోరంట్ల మాధ‌వ్‌పై కూట‌మి నేత‌ల ఫిర్యాదు

కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందన్న‌ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా గోరంట్ల మాధవ్ వ్యవహరించారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు అనంతపురం పోలీసులు మాధవ్ చేసి వ్యాఖ్యలను పరిశీలించి కేసు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతున్న‌ట్లు స‌మాచారం…

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది