Posani Murali Krishna : రాజంపేట సబ్‌ జైలుకు పోసాని మురళీకృష్ణ.. ఖైదీ నెంబ‌ర్ ఎంతంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Posani Murali Krishna : రాజంపేట సబ్‌ జైలుకు పోసాని మురళీకృష్ణ.. ఖైదీ నెంబ‌ర్ ఎంతంటే..?

 Authored By prabhas | The Telugu News | Updated on :28 February 2025,11:21 am

ప్రధానాంశాలు:

  •  Posani Murali Krishna : రాజంపేట సబ్‌ జైలుకు పోసాని మురళీకృష్ణ.. ఖైదీ నెంబ‌ర్ ఎంతంటే..?

Posani Murali Krishna : సినీ న‌టుడు పోసాని ముర‌ళికృష్ణకి Posani Murali Krishna రైల్వే కోడూరు కోర్టు Railway Kodur Court 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కొద్దిసేప‌టి క్రితం పోలీసులు ఆయనను రాజంపేట స‌బ్ జైలుకు త‌ర‌లించారు. పోసానిని క‌స్ట‌డీకి కోరుతూ ఈరోజు పోలీసులు పిటిష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది. కాగా, ఆయ‌న రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విష‌యాలను వెల్ల‌డించారు. పోసాని త‌న వ్యాఖ్య‌ల‌తో కులాల మ‌ధ్య చిచ్చు పెట్టార‌ని పోలీసులు అభియోగాలు మోపారు. అలాగే ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ Deputy CM Pavan Kalyan, ఆయ‌న కుటుంబాన్ని నోటికి వ‌చ్చిన‌ట్లుగా దూషించార‌ని తెలిపారు.

Posani Murali Krishna రాజంపేట సబ్‌ జైలుకు పోసాని మురళీకృష్ణ ఖైదీ నెంబ‌ర్ ఎంతంటే

Posani Murali Krishna : రాజంపేట సబ్‌ జైలుకు పోసాని మురళీకృష్ణ.. ఖైదీ నెంబ‌ర్ ఎంతంటే..?

Posani Murali Krishna పోసానిపై ఇప్ప‌టికే 14 కేసులు న‌మోదు

దీంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఓ కులాన్ని ఆపాదించార‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్‌ Minister Nara Lokesh ను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. మహిళలు అని కూడా చూడకుండా కించపరిచేలా మాట్లాడారని, నంది అవార్డు కమిటీ Nandi Award Committee పై కులం పేరుతో దూషించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు లో వెల్లడించారు. నంది అవార్డుల క‌మిటీపై కులం పేరిట అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని, నారా లోకేశ్‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో తిట్టార‌ని వెల్ల‌డించారు. దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా పోసాని వ్యాఖ్యలు చేసిన‌ట్లు తెలిపారు. విచారణకు పోసాని సహకరించలేదని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా పోసానిపై ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా 14 కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు.

పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధ‌వారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంట‌ల పాటు విచారించిన పోలీసులు రాత్రి జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది