Business : ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం.. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business : ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం.. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం.. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి..!

Business  : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా ఏదైనా చేయాలని ఆశపడుతున్నవారికి గుడ్ న్యూస్. అగరుబత్తుల తయారీ ఒక సులభమైన, తక్కువ పెట్టుబడి వ్యాపార అవకాశంగా నిలుస్తోంది. ఈ వ్యాపారాన్ని మీరు మీ ఇంటినుంచే ప్రారంభించవచ్చు. పెద్ద స్థలం, భారీ పెట్టుబడి అవసరం లేకుండానే చిన్న స్థాయిలో ప్రారంభించి, మెల్లగా పెద్ద స్థాయికి వెళ్ళవచ్చు.

Business ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి

Business : ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం.. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి..!

Business : ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి.. లక్షలు వెనకేసుకోండి

భారతదేశం తో పాటు విదేశాలలోనూ అగరుబత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా పూజలలో, వాతావరణాన్ని సుగంధంగా మార్చడంలో అగరుబత్తులు కీలకంగా ఉపయోగపడతాయి. సహజ మూలికలతో తయారయ్యే ఈ ధూప కర్రలు పండుగల సమయంలో మరింతగా వినియోగించబడతాయి. ప్రపంచంలోని 90 కి పైగా దేశాలకు భారతదేశం అగరుబత్తులను ఎగుమతి చేస్తోంది. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ రంగంలో మీరు విజయం సాధించవచ్చు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రారంభ ఖర్చు రూ. 40,000 నుండి 80,000 మధ్య ఉంటుందని అంచనా. దీనికి అవసరమైన యంత్రాలు, ముడి పదార్థాలు, లైసెన్స్, GST రిజిస్ట్రేషన్ మొదలైనవి ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. నెలకు సగటున రూ. 1.5 లక్షల వరకు వ్యాపారం చేసి, రూ. 50,000 వరకు లాభం పొందవచ్చు. డిమాండ్ పెరిగే కొద్దీ ఆదాయం లక్షలకు చేరుకోవచ్చు. అందువల్ల సొంతంగా కొత్తగా ఏదైనా ప్రారంభించాలని ఆశపడుతున్నవారికి అగరుబత్తుల తయారీ ఉత్తమమైన వ్యాపార ఆలోచనగా నిలవనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది