Apple : యూజర్స్ ఈ కారణాలతో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారొచ్చు..అవేంటంటే?
Apple : పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలోనూ యాపిల్ ఐఫోన్ అమ్మకాలు బాగానే ఉన్నాయి. అయితే, యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండిటిలో ఏది బెస్ట్ అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. కాగా, తాజాగా ఐఫోన్ కంపెనీ వారు ఆండ్రాయిడ్ యూజర్స్ ఐఫోన్‌కు ఎందుకు మారాలో వివరించారు.యూజర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడం అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన పని అని చెప్పొచ్చు. కాగా, ఆండ్రాయిడ్ కంటే కూడా యాపిల్ ఐఫోన్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను అత్యంత భద్రంగా దాచిపెట్టొచ్చు. ఆన్ లైన్ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా ఉండేందుకుగాను యాపిల్ ప్రత్యేక భద్రతను కలిగి ఉంటుంది.
ఫింగర్ ప్రింట్, ఫేషియల్ అథంటికేషన్ లాంటివి కూడా యాప్స్ సేకరించకుండా సెక్యూరిటీ ఉంటుందని యాపిల్ కంపెనీ చెప్తోంది. ఐమెసేజ్, ఫేస్‌టైమ్ వీడియో కాల్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఉంటుందని తెలిపింది.ఆండ్రాయిడ్ మొబైల్స్ అప్ డేట్స్ కొంత స్లోగా ఉంటాయి. కాగా, ఐఫోన్‌లలో అటువంటి సమస్యలు ఉండబోవు. ఐఫోన్లకు ఐఓఎస్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. దీంతో కొత్తగా వచ్చే ఫీచర్స్ అన్నిటినీ యూజర్స్ ఎప్పటికప్పడు యూజ్ చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్ మోడల్స్‌కు సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
Apple : యాపిల్ కంపెనీ వారు చెప్తున్న కారణాలివే..
అన్ని స్మార్ట్ ఫోన్ గ్లాసెస్ కంటే కూడా ఐఫోన్ గ్లాసెస్ బాగా స్టాండర్డ్‌గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఐ ఫోన్స్‌ను ఎక్కువ కాలం వాడొచ్చు. ఐఫోన్ కెమెరాలు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. దాంతో మీకు కెమెరా ఎక్స్‌పీరియెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే కూడా బయోనిక్ ఏ చిప్ సెట్‌తో వచ్చే ఐఫోన్స్ చాలా వేగంగా పని చేస్తాయి. ఇకపోతే ఈమెయిల్ అకౌంట్స్, క్యాలెండర్, ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ అన్నిటినీ మూవ్ టు ఐఓఎస్ అనే యాప్ ద్వారా అత్యంత ఈజీగా ట్రాన్స్ ఫర్ చసుకోవచ్చు. అలా మొత్తంగా ఐఫోన్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆండ్రాయిడ్ కంటే ఏ విషయాల్లో ఐఫోన్ బెటర్ అనే విషయాలను యాపిల్ కంపెనీ వివరించింది.