Best investment : సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఫార్ములా ఇదే .. తక్కువ పెట్టుబడి , అధిక రాబడి..!!
ప్రధానాంశాలు:
Best investment : సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఫార్ములా ఇదే .. తక్కువ పెట్టుబడి , అధిక రాబడి..!!
Best investment : ప్రతి ఒక్కరు తాము సంపాదించిన డబ్బును ఎంతో కొంత దాచి పెడుతుంటారు. భవిష్యత్తులో పిల్లలు చదువులు, పెళ్లిళ్లకు పనికి వస్తాయని పేరెంట్స్ ఎంతో కష్టపడుతుంటారు. అయితే మనం దాచుకునే డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం ద్వారా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. భారీ సంపాదనకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కూడా కావచ్చు. లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ 15 నుంచి 20% వరకు రిటర్న్ అందిస్తాయి. యావరేజ్ రిటన్స్ ని 12 శాతంగా అంచనా వేయవచ్చు. అంతేకాకుండా చక్రవడ్డీ ప్రయోజనం కూడా పొందుతారు. దీంతో సంపద చాలా వేగంగా జరుగుతుంది. SIP సహాయంతో తక్కువ సమయంలో కోటీశ్వరులు కావాలనుకుంటే 15×15×15 ఫార్ములా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే మార్కెట్ లింక్ అయినందున సిప్ లో రిటర్న్స్ కి ఎటువంటి హామీ ఉండదని గుర్తించాలి. రాబడి మార్కెట్ కండిషన్ పై ఆధారపడి ఉంటాయి. 15×15×15 ఫార్ములా ప్రకారం 15 సంవత్సరాల పాటు ప్రతినెల 15000 సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో 15% వడ్డి పొందవచ్చు . ఎందుకంటే సిప్ లో లాంగ్ టర్మ్ లో 15% రాబడిని పొందడం పెద్ద విషయం కాదు. ఆ ఈ ఫార్ములా అని అనుసరించి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 15000 చొప్పున 15 సంవత్సరాలలో 27 లక్షలు పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం పై 15% వడ్డీని పొందుతారు మొత్తం 74,52,946 అవుతుంది.
ఇలా ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి వడ్డీ కలిపితే 15 ఏళ్లలో 1,01,52,946 ఫండ్ రెడీ అవుతుంది. అంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారో అంత త్వరగా కోటీశ్వరులు అవుతారు. 25 సంవత్సరాల వయసులో 15× 15×15 ఫార్ములా ను పాటిస్తే 45 సంవత్సరాలకు కోటీశ్వరులవుతారు. అయితే ఈ ఫార్ములాను అనుసరించి ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలనుకుంటే ఆదాయం నెలకు 80,000 ఉండాలి. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం ప్రతి నెల 20% ఇన్కమ్ సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. నెలవారి ఆదాయం 80000 అయితే ప్రతి నెల 16,000 లేదా ఆదాయంలో 20% ఆదా చేసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో సిప్ లో నెలకు 15000 ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర అవసరాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు.