Business idea : త‌క్కువ పెట్టుబ‌డితో ఇంటి నుంచే బిజినెస్ చేసి.. మంచి ఆదాయం పొంద‌డి

Authored By mallesh | The Telugu News | Updated on : 26 June 2022, 12:30 pm

Business idea : క‌రోనా పాండ‌మిక్ ప్ర‌పంచాన్ని కుదిపేసిన నేప‌థ్య‌లో రోగనిరోధకశక్తిని పెంచుకోవ‌డానికి మంచి ఆహారం తీసుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. చాలా మంది రోజువారీ ఆహారంలో సుగంద ద్ర‌వ్యాల వాడకం కూడా బాగా పెంచేశారు. పైగా భార‌తీయులు మ‌సాలా దినుసుల‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు. ప్ర‌తి ఇంట్లో వంట‌గ‌దిలో ఇవి త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి. వీటి వాడకం పెరిగిన నేప‌థ్యంలో వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే వీటి త‌యారికి ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతున్నారు. ఇక సొంతంగా వ్యాపారం చేయాల‌నుకునే వారికి ఇది చ‌క్క‌టి మార్గం. అన్ని సీజ‌న్లో ఈ వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంటుంది.

అయితే మ‌సాలా మేకింగ్ యూనిట్ కి ఎంత మొత్తంలో పెట్టుబ‌డి అవ‌స‌రం ఉంటుంది..? ఎంత వ‌ర‌కు అవ‌గాహ‌న ఉండాలి..? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అన్న‌ది ఇప్పుడు చూద్దాం… ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) నివేదిక ప్ర‌కారం సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం పెట్టుబ‌డి రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది. కాగా 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు రూ.60,000 వ‌ర‌కు, పరికరాలు రూ.40,000 వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. ఇది కాకుండా పనులు ప్రారంభించేందుకు అయ్యే ఖర్చుకు రూ.2.50 లక్షలు అవసరం ఉంటుంది. పెట్టుబడికి అంత మొత్తంలో లేకపోతే బ్యాంకు నుంచి రుణం కూడా పొంద‌వ‌చ్చు. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు.

Business idea from home with low investment and get good income

Business idea from home with low investment and get good income

Business idea : మొత్తం పెట్టుబ‌డి రూ.3.50 ల‌క్ష‌లు

అయితే ఖ‌ర్చు త‌గ్గించుకునే మార్గం ఏంటంటే.. అద్దె స్థలంలో కాకుండా సొంత స్థంలోగానీ ఇంట్లో గానీ ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఈ ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఏటా 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి చేస్తే. ఇందులో క్వింటాకు రూ.5400 చొప్పున ఏడాదిలో మొత్తం రూ.10.42 లక్షలు సంపాధించవచ్చు. ఇందులో ఖర్చులన్నీ పోనూ ఏటా రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ.21 వేలకుపైగా సంపాదించ‌వ‌చ్చు. అయితే ఉత్ప‌త్తి చేసిన మ‌సాలా దినుసుల‌ను ఆక‌ర్ష‌ణీయంగా ప్యాకింగ్ చేయాలి. ఉత్ప‌త్తిని స్థానిక మార్కెట్లో, హోల్ సేల్, రిటైల్ షాపుల‌లో, డైరెక్ట్ క‌స్ట‌మ‌ర్స్ తో కూడా అమ్మ‌కాలు చేయ‌వ‌చ్చు. అలాగే వ్యాపారం ఎదుగుతున్న కొద్ది ప్ర‌త్యేక‌ వెబ్ సైట్, సోష‌ల్ మీడియా ద్వారా త‌మ ప్రాడ‌క్ట్స్ ని ప్ర‌మోట్ చేసుకుంటే బిజినెస్ మరింత పెరిగే అవ‌కాశం ఉంటుంది.

mallesh

No bio available for this author.

  1. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  2. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  3. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  4. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  5. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  6. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  7. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp