Business Ideas : ఈ యువకుడి బిజినెస్ ఐడియా కి అందరు ఫిదా.. 5 వేల పెట్టుబడితో నెలకు 30 వేలు సంపాదిస్తున్నాడు ఇలా..!
Business Ideas : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. మరికొందరు పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్న ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అయితే అలాంటి వారికి పెట్టుబడి తక్కువతో చేసుకునే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం యువత ఉద్యోగం రాకపోయినా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పాతకాలం పద్ధతిని కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయంలో లాభాలను అందుకుంటున్నారు. చిన్నచిన్న ఐడియాలతో బిజినెస్ చేస్తూ ఎటువంటి టెన్షన్ లేకుండా సొంత ఊరిలో హాయిగా జీవిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామంలో గట్రెడ్డి రెడ్డి శ్రీను 5 వేల రూపాయలకు పొలంలో చీడపురుగులు తొలగించేందుకు మందులు కొట్టే స్ప్రేయర్ తీసుకొని నెలకు 30 వేల రూపాయలు వరకు సంపాదిస్తున్నారు. రైతుల పనిని సులువుగా చేస్తూ మరోవైపు తాము ఆదాయం పొందుతున్నారు. మూడు నెలల్లోనే లక్ష రూపాయల వరకు సంపాదించినట్లు ఆ యువకుడు చెబుతున్నారు. ఐదు సంవత్సరాల నుండి వ్యవసాయ చేస్తూ స్ప్రేయర్ తో గ్రామంలో ఎవరి పొలానికి అయినా మందులు పిచికారి చేయాలంటే తమ స్ప్రేయర్ తీసుకువెళ్లి కొట్టడం జరుగుతుంది.అయితే శ్రీనుకి రైతులు ఎకరానికి కొంత మొత్తంలో ఇస్తున్నారు. అలా రోజుకి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నానని శ్రీను చెబుతున్నాను. డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో శ్రీను తన తండ్రి బాటలో వ్యవసాయం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాను ఒక స్ప్రేయర్ ను కొనుగోలు చేసి గ్రామంలో అందరి పొలాలకు మందు కొడుతు జీవనం సాగిస్తున్నాడు. సీజన్ బట్టి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చని శ్రీను చెబుతున్నారు. పెట్టుబడి తక్కువే అయినా కష్టపడితే అధిక లాభాలను పొందవచ్చు అని శ్రీను చెబుతున్నారు. ఎక్కువ మందులు పిచికారి చేయాలంటే తనతో పాటు స్నేహితులను కూడా తీసుకువెళ్లి వాళ్లకు కూడా జీవనోపాధిని కల్పిస్తున్నాం అంటూ శ్రీను తెలియజేసాడు.