Business Idea : పుట్టగొడుగులను పెంచుతూ.. నెలకు లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఎలా సాధ్యమైందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Idea : పుట్టగొడుగులను పెంచుతూ.. నెలకు లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఎలా సాధ్యమైందో తెలుసా?

Business Idea : ఒప్పుడు బీహార్‌లోని ముంగేర్ జిల్లా, ధౌరీ గ్రామం అన్ని గ్రామాల్లాగే ఉండేది. కానీ బీనా దేవి పెళ్లి చేసుకుని ఆ గ్రామానికి వచ్చాక కొన్నేళ్లకు ఆ గ్రామం దేశంలో గుర్తించదగ్గ స్థాయికి ఎదిగింది. పుట్టగొడుగుల మహిళగా పేరు పొందిన బీనా దేవీ విజయగాథ వింటుంటే ఎంతో స్ఫూర్తి పొందుతారు. ఆమె తను అభివృద్ధి చెందుతూనే… తనతో పాటు వందలాది మంది మహిళలు పురోగతి సాధించేలా తోడ్పాటును అందిస్తోంది. తను చేసిన కృషిని గుర్తించిన […]

 Authored By jyothi | The Telugu News | Updated on :27 March 2022,11:40 am

Business Idea : ఒప్పుడు బీహార్‌లోని ముంగేర్ జిల్లా, ధౌరీ గ్రామం అన్ని గ్రామాల్లాగే ఉండేది. కానీ బీనా దేవి పెళ్లి చేసుకుని ఆ గ్రామానికి వచ్చాక కొన్నేళ్లకు ఆ గ్రామం దేశంలో గుర్తించదగ్గ స్థాయికి ఎదిగింది. పుట్టగొడుగుల మహిళగా పేరు పొందిన బీనా దేవీ విజయగాథ వింటుంటే ఎంతో స్ఫూర్తి పొందుతారు. ఆమె తను అభివృద్ధి చెందుతూనే… తనతో పాటు వందలాది మంది మహిళలు పురోగతి సాధించేలా తోడ్పాటును అందిస్తోంది. తను చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం రాష్ట్రపతి నుండి నారీ శక్తి అవార్డుతో సత్కరించింది.కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా శిక్షణ పొందింది బీనా. ఇందులో గ్రామీణ మహిళలను సేంద్రీయ వ్యవసాయంలో పాల్గొనేలా చేయడం కోసం వారి గృహాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణ శ్రేయస్సుకు దోహదం చేసే అంశాల్లో శిక్షణ ఇస్తారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బీనా.. పుట్ట గొడుగుల పెంపకం గురించి తెలుసుకుని వాటి వైపు ఆకర్షితురాలు అయ్యింది. 2013లో, బీనా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. ఇంటి చుట్టూ పాత పలాంగ్ లేదా మంచం ఉంచి దాని కింద ఒక కిలో పుట్టగొడుగులను పెంచడం మొదలు పెట్టింది. పుట్టగొడుగులు చాలా పోషకమైనవి మరియు అనేక ఇతర పండ్లు లేదా కూరగాయలతో పోలిస్తే మార్కెట్‌లో అధిక విలువ ఉండటంతో బీనా ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇది తనలో ఉత్సాహాన్ని పెంచింది. ప్రస్తుతం బీనా ఐదు బ్లాక్‌లు మరియు 105 పొరుగు గ్రామాలలో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతోంది. దాదాపు 10,000 మంది గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చింది.ఈ రంగంలో ఆమె విస్తృతమైన కృషితో పాటు గ్రామీణాభివృద్ధిలో ఆమె చేసిన కృషి కారణంగా, బీనా ఐదేళ్లపాటు తేటియాబాంబర్ బ్లాక్‌లోని ధౌరీ పంచాయతీకి సర్పంచ్ లేదా గ్రామ అధిపతిగా కూడా పనిచేశారు.

Business Idea mushroom earns lakhs india nari shakti puraskar women organic farming inspiring

Business Idea mushroom earns lakhs india nari shakti puraskar women organic farming inspiring

ఆమె సేంద్రీయ మరియు పుట్టగొడుగుల వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా, వర్మి-కంపోస్ట్ ఉత్పత్తి, సేంద్రీయ పురుగుమందులు మరియు పాడి వ్యవసాయంలో ప్రజలకు శిక్షణ ఇచ్చింది. ఈ రోజు, ఆమె తన నెలవారీ రూ.90,000 (పుట్టగొడుగుల పెంపకం ద్వారా రూ. 30,000 మరియు వివిధ కూరగాయల సేంద్రీయ వ్యవసాయం ద్వారా రూ. 60,000) సంపాదనతో 18 మంది సభ్యులతో కూడిన మొత్తం కుటుంబాన్ని ఒంటరిగా పోషిస్తోంది. 3 కుమారులు మరియు ఒక కుమార్తె ఉండగా.. వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని మంచి విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా ఇంజినీర్‌గా చదువుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు, ముఖ్యంగా కుమార్తెలకు ఇవ్వగల అతి ముఖ్యమైన బహుమతి స్వేచ్ఛ అని చెబుతుంది బీనా. ఏదైనా చేయగలిగే స్వేచ్ఛ వారికి ఉన్నప్పుడు వారు అద్భుతాలు చేస్తారని అంటుంది బీనా దేవి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది