Business Idea : ఆర్గానిక్ చాకోలెట్స్ తయారు చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్నాడు.. వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసా..?
చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాక్లెట్స్ అంటే ఇష్టంగా లాగించేస్తుంటారు. తమ జీవితంలోని సంతోష క్షణాలను ఇతరులతో పంచుకోవడానికి చాక్లెట్స్ పంచుతుంటారు. మన దేశంలో దొరికే చాక్లెట్స్, ఫారిన్ చాక్లెట్స్(స్విస్ చాక్లెట్స్) టేస్టే కొంచెం తేడాగా ఉంటుంది. అథెంటిక్ చాక్లెట్ టేస్ట్ మన చాక్లెట్స్ లో ఉండవు.. ఈ డౌట్.. చాక్లెట్ లవర్ దేవన్ష్ అషర్ ను చాక్లెట్ బిజినెస్ పెట్టేలా చేసింది. చాక్లెట్ తయారీ మీద ఇంట్రెస్ట్ తో.. మార్చి 2014లో, అతను కెనడాలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత చాక్లెట్ స్కూల్ అయిన ఎకోల్ చాక్లెట్ లో మూడు నెలల ఆన్‌లైన్ చాక్లెట్-మేకింగ్ కోర్సులో చేరాడు దేవాన్ష్.తన నైపుణ్యాలపై నమ్మకంతో దేవాన్ష్ జూన్ 2014లో ముంబైలో జరిగిన పాప్-అప్‌లో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. అతని చాక్లెట్ అక్కడి వారికి చాలా నచ్చింది.
ఈ ఉత్సాహంతో.. 2015, మేలో తన.. ఆర్గానిక్ చాక్లెట్ బ్రాండ్ ‘పస్కాటి’ ప్రారంభించాడు దేవాన్ష్. ‘నేను నా వ్యాపారానికి ‘పస్కాటి’’ అని పేరు పెట్టడానికి కారణం ఉంది. ఇది సంస్కృతం పదం పస్కత్ పరివస్య నుంచి వచ్చింది. అంటే ‘తీపి భోజనం’ అని అర్థం. ‘పస్కాటి’’ భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్-సర్టిఫైడ్ చాక్లెట్‌లను ఉత్పత్తి చేస్తుంది. మేము ప్రస్తుతం 14 రకాల చాక్లెట్‌లను తయారు చేస్తున్నాం. దేవాన్ష్ కేరళలోని ఇడుక్కి మరియు మలబార్ ప్రాంతాల్లోని రైతు సంఘాల నుంచి కోకో గింజలను కొంటున్నారు. ఇది రెండు వేలకు పైగా రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుంది.’- దేవాన్ష్
స్వచ్ఛమైన చాక్లెట్ ను చాక్లెట్ లవర్స్ కు అందించడానికి దేవాన్ష్ ‘బీన్ టు బార్’ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. విదేశాల్లో మాదిరిగా.. భారతీయ మార్కెట్‌లో దీన్ని తయారు చేసే వారు చాలా తక్కువ అని దేవాన్ష్ అంటున్నారు. పస్కాటి చాక్లెట్ ను ఫెయిర్‌ట్రేడ్ ఇండియా ధ్రువీకరించింది. పస్కాటి యూఎస్డీఏ ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. అంటే ఇది ఎలాంటి ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి ప్రొడక్ట్ వాడట్లేదని ధ్రువీకరించింది.ఉత్పత్తి యొక్క నాణ్యత చాలా ముఖ్యం. ఉత్పత్తి, దాని ప్యాకేజింగ్‌పై రాజీపడకండి.. ఎందుకంటే ఇవి చాలా కీలకమైనవి. బాగా ఇష్టపడే బ్రాండ్‌ను రూపొందించడానికి సమయం పడుతుంది, కానీ ఓపికగా ఉండండి,- దావాన్ష్