Business Idea : మీ పెరట్లో ఖాళీ స్థలం ఉందా… అయితే నెలకు లక్షల ఆదాయం పొందండి ఇలా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : మీ పెరట్లో ఖాళీ స్థలం ఉందా… అయితే నెలకు లక్షల ఆదాయం పొందండి ఇలా…!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 October 2022,5:00 pm

Business Idea : ప్రస్తుతం చాలామంది సొంతం వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటివారు అతి తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం చేయడం ద్వారా ప్రతినెల ఆదాయం పొందే వీలుంది. మీ పెరట్లో కొద్దిగా ఖాళీ స్థలం ఉంటే చాలు చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు అలాగే ఆర్గానిక్ మాంసం తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆహారం బాగా కలుషితం అయిపోయింది. ముఖ్యంగా ఎడాపెడా వాడేస్తున్న రసాయనాల కారణంగా ఆహార పదార్థాలు బాగా కలుషితం అవుతున్నాయి. దీనికి ఉదాహరణగా పౌల్ట్రీ పరిశ్రమ చెప్పుకోవచ్చు.

పౌల్ట్రీ పరిశ్రమలో రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారు. దీని ద్వారా కోడి మాంసం, గుడ్లు అన్నీ కలుషితం అయిపోయాయి. దీంతో ప్రజలు ప్రస్తుతం నాటు కోళ్లు నాటు కోడి గుడ్లు తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకొని వ్యాపారంగా మలుచుకోవచ్చు. అందుకోసం మీ పెరట్లో ఆర్గానిక్ కోడిగుడ్ల వ్యాపారం ప్రారంభించవచ్చు. సాధారణ కోడిగుడ్లు కన్నా నాటు కోడిగుడ్ల ధర ఎక్కువ ఆదాయం ఉంటుంది. ముందుగా పెరట్లో ఒక ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. అందులో నాటు కోళ్లని సేకరించి వాటి గుడ్లను ఇంక్యూబెటర్ సహాయంతో కోడి పిల్లలుగా మార్చుకోవచ్చు. దీని ద్వారా నాటు కోళ్ల ఫారం అతి తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు.

Business ideas poultry farm earn lakhs of rupees

Business ideas poultry farm earn lakhs of rupees

నాటు కోళ్ల ఫారం సాధారణ కోళ్ల ఫారంలాశకాదు ఆరుబయటే పెంచాలి. అప్పుడే కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకు ఇంక్యుబేటర్ సహాయం తీసుకోవాలి. నాటుకోళ్లు ఐదవ నెల నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేయి కోళ్లని పెంచితే రోజుకు 500 కోడిగుడ్లు ఉత్పత్తి అవుతాయి. అంటే రోజుకు 500 గుడ్లను అమ్మవచ్చు. వీటిలో కొన్ని గుడ్లను పిల్లలుగా మార్చుకునేందుకు ఉంచుకోవాలి. మిగతా వాటిని మార్కెట్లో అమ్ముకోవాలి. కోళ్లు అలాగే గుడ్ల మధ్య బ్యాలెన్స్ మైంటైన్ చేయాలి. అప్పుడు కొత్త కోళ్లు కూడా వస్తాయి. మిగతా కోళ్లను మాంసం కోసం అమ్మవచ్చు. దీని ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది