Business Idea : ఈ బిజినెస్ లో రెండు లక్షల పెట్టుబడితో.. నెలకు లక్షకు పైగా ఆదాయం..
Business Idea : కరోనా వచ్చాక చాలామంది తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. దీంతో అలాంటి వారంతా సొంతంగా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. కొందరు ఇళ్లకు వెళ్లి సాంప్రదాయ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మరికొందరు సొంత బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వారికి ఫ్లై యాష్ బ్రిక్స్ అనేది మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడి తో మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు ఈ బ్రిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం 100 గజాల స్థలం కనీసం రెండు లక్షలు పెట్టుబడితో బిజినెస్ ను మొదలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెల ఒక లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చు.
వేగవంతమైన పట్టణీకరణ యుగంలో బిల్డర్లు ఫ్లై యాష్ తో చేసిన ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఈ బిజినెస్ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇటుకలను విద్యుత్ ప్లాంట్ లో నుంచి వెలువడి బూడిద, సిమెంట్ మరియు రాతి దూళి మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ వ్యాపారం కోసం మీరు ఎక్కువ పెట్టుబడిని యంత్రాలపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు 1.5 లక్షలు ఉంటుంది. ఈ యంత్రం ద్వారా ఇటుక ఉత్పత్తి కోసం ఐదు నుండి ఆరు మంది వ్యక్తుల అవసరం. దీంతో రోజుకు సుమారుగా 3000 ఇటుకలను తయారు చేయవచ్చు.
ఈ యంత్రం ధర ఐదు నుంచి పది లక్షల వరకు ఉంటుంది. ఆటోమేటిక్ యంత్రాలతో ఎక్కువ ఉత్పత్తితోపాటు ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఆటోమేటిక్ మిషన్ ధర 10 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది ముడి సరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు యంత్ర ద్వారా పనులు జరుగుతాయి. ఆటోమేటిక్ మిషన్ ద్వారా గంటలో 1000 ఇటుకలను తయారు చేయవచ్చు. అంటే ఈ యంత్రం సహాయంతో మీరు నెలకి మూడు నుండి నాలుగు లక్షల వరకు ఇటుకలను తయారు చేయవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి బ్యాంకులు నుంచి రుణం కూడా తీసుకోవచ్చు. ఎస్సి బీసీ కార్పొరేషన్ నుంచి కూడా రుణ సదుపాయం పొందవచ్చు.