Business ldea : నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఒక ఫేమస్ ఇంగ్లీష్ సామెత. తెలుగు అయితే అవసరమే ఆవిష్కరణలకు అమ్మ వంటిది అని అంటారు. ఒక అవసరం సమస్యగా మారినప్పుడు దానిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నంలోనే కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అవి చెప్పలేనంత విజయాన్ని తెచ్చిపెడతాయి. సామాన్యులను కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాంటిదే జరిగింది ఆ అక్కాచెల్లెల్లకు.ఒకప్పుడు గుడికి వెళ్లాలనుకున్నప్పుడు వెంట కొన్ని పూలు తీసుకెళ్లే వారు. ఇంటి వెనక ఉన్న పూల చెట్ల నుండి దోసిట్లో పూలు కోసి లేదా రోడ్డు పక్కన ఉండే చెట్ల నుండి పూలు కోసి గుడికి వెళ్లేవారు. ఇంట్లో ఉన్న దేవునికి పూజ చేయాలన్న ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు చెట్లు పెంచుకోవడానికి సరిపడా స్థలం లేక చాలా మంది పూల మొక్కలకు దూరమయ్యారు.
ఈ అవసరమే బెంగళూరుకు చెందిన యశోద కరుటూరి, రియా అక్కాచెల్లెల్లకు మంచి బిజినెస్ ను చూపించింది. ఉదయమే ఇంటికి పాల ప్యాకెట్ వస్తుంది. వార్తా పత్రిక కూడా తెల్లవారుజామునే ఇంటికి చేరుతుంది ఆన్ లైన్ ఆర్డర్ చేయగానే ఏదంటే అది మన ముంగిట వాలిపోతుంది. అలాగే పూలనూ ఆన్ లైన్ లో డెలివరీ చేయాలనుకున్న ఆ అక్కాచెల్లెల్లు. తాజా గులాబీలు, చామంతి, తామరపువ్వులు ఇంకా చాలా పూలు ఇంటికే డెలివరీ చేసే స్టార్టప్ ను ప్రారంభించారు. దానికి హూవూ అనే పేరు పెట్టారు.10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన హూవూ ఇప్పుడు ఏటా రూ.8 కోట్ల టర్నోవరు సాధిస్తోంది. 2019 నుండి, అక్కాచెల్లెల్లు ఇద్దరూ పూల మార్కెట్‌కు సబ్‌స్క్రిప్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇద్దరు సోదరీమణులు బెంగళూరులో పెరిగారు. మరియు ఇథియోపియాలోని పాఠశాలలకు హాజరయ్యారు. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది యశోధ.
ఫ్లవర్ బొకే మార్కెట్ చాలా వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందినప్పటికీ, సాంప్రదాయ పూజ పూల మార్కెట్ అంతగా పెరగనట్లు గుర్తించారు. ఫ్లవర్ బోకేల్లో వాడే పూల కంటే కూడా.. సాంప్రదాయ పూలనే ప్రజలు ఎక్కువగా వాడతారనేది గ్రహించారు. కానీ దాని మార్కెట్ మాత్రం ఏమాత్రం బాలేనట్లు గుర్తించారు.మార్కెట్ గురించి క్షుణ్ణంగా పరిశోధన చేసిన తర్వాత, 2019లో, డిమాండ్‌తో పాటు సరఫరా వైపు నుంచి సమస్యను పరిష్కరించే ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, హూవును ప్రారంభించారు. హూవు అంటే కన్నడలో పువ్వులు అని అర్థం. హూవు ద్వారా తాజా పూలను అందిస్తున్నారు అక్కాచెల్లెల్లు. నాణ్యమైన ప్యాకింగ్ తో పూలను డెలివరీ చేస్తున్నారు. దీని వల్ల పూలు 15 రోజుల వరకూ ఏమాత్రం పాడవకుండా ఉంటాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణే, ముంబై, గురుగ్రామ్ మరియు నోయిడా నుండి నెలకు 1,50,000 ఆర్డర్‌లను అందుకుంటున్నారు. గత సంవత్సరం, అగర్బత్తీలను పరిచయం చేయగా… అవి కూడా విజయవంతం అయ్యాయని చాలా ఆనందంగా చెబుతున్నారు ఆ అక్కాచెల్లెల్లు.
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్…
Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్…
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…
Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్…
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…
This website uses cookies.