Business ldea : దేవుడి పూజ కోసం వాడే పూలను హోం డెలివరీ చేస్తూ ఏడాదికి 8 కోట్లు సంపాదిస్తున్న అక్కాచెల్లెళ్లు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business ldea : దేవుడి పూజ కోసం వాడే పూలను హోం డెలివరీ చేస్తూ ఏడాదికి 8 కోట్లు సంపాదిస్తున్న అక్కాచెల్లెళ్లు.. ఎక్కడో తెలుసా?

Business ldea : నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఒక ఫేమస్ ఇంగ్లీష్ సామెత. తెలుగు అయితే అవసరమే ఆవిష్కరణలకు అమ్మ వంటిది అని అంటారు. ఒక అవసరం సమస్యగా మారినప్పుడు దానిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నంలోనే కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అవి చెప్పలేనంత విజయాన్ని తెచ్చిపెడతాయి. సామాన్యులను కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాంటిదే జరిగింది ఆ అక్కాచెల్లెల్లకు.ఒకప్పుడు గుడికి వెళ్లాలనుకున్నప్పుడు వెంట కొన్ని పూలు తీసుకెళ్లే వారు. […]

 Authored By jyothi | The Telugu News | Updated on :20 May 2022,12:00 pm

Business ldea : నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఒక ఫేమస్ ఇంగ్లీష్ సామెత. తెలుగు అయితే అవసరమే ఆవిష్కరణలకు అమ్మ వంటిది అని అంటారు. ఒక అవసరం సమస్యగా మారినప్పుడు దానిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నంలోనే కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అవి చెప్పలేనంత విజయాన్ని తెచ్చిపెడతాయి. సామాన్యులను కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాంటిదే జరిగింది ఆ అక్కాచెల్లెల్లకు.ఒకప్పుడు గుడికి వెళ్లాలనుకున్నప్పుడు వెంట కొన్ని పూలు తీసుకెళ్లే వారు. ఇంటి వెనక ఉన్న పూల చెట్ల నుండి దోసిట్లో పూలు కోసి లేదా రోడ్డు పక్కన ఉండే చెట్ల నుండి పూలు కోసి గుడికి వెళ్లేవారు. ఇంట్లో ఉన్న దేవునికి పూజ చేయాలన్న ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు చెట్లు పెంచుకోవడానికి సరిపడా స్థలం లేక చాలా మంది పూల మొక్కలకు దూరమయ్యారు.

ఈ అవసరమే బెంగళూరుకు చెందిన యశోద కరుటూరి, రియా అక్కాచెల్లెల్లకు మంచి బిజినెస్ ను చూపించింది. ఉదయమే ఇంటికి పాల ప్యాకెట్ వస్తుంది. వార్తా పత్రిక కూడా తెల్లవారుజామునే ఇంటికి చేరుతుంది ఆన్ లైన్ ఆర్డర్ చేయగానే ఏదంటే అది మన ముంగిట వాలిపోతుంది. అలాగే పూలనూ ఆన్ లైన్ లో డెలివరీ చేయాలనుకున్న ఆ అక్కాచెల్లెల్లు. తాజా గులాబీలు, చామంతి, తామరపువ్వులు ఇంకా చాలా పూలు ఇంటికే డెలివరీ చేసే స్టార్టప్ ను ప్రారంభించారు. దానికి హూవూ అనే పేరు పెట్టారు.10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన హూవూ ఇప్పుడు ఏటా రూ.8 కోట్ల టర్నోవరు సాధిస్తోంది. 2019 నుండి, అక్కాచెల్లెల్లు ఇద్దరూ పూల మార్కెట్‌కు సబ్‌స్క్రిప్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇద్దరు సోదరీమణులు బెంగళూరులో పెరిగారు. మరియు ఇథియోపియాలోని పాఠశాలలకు హాజరయ్యారు. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది యశోధ.

Business ldea sisters subscription based puja flower delivery at home startup earn crores

Business ldea sisters subscription based puja flower delivery at home startup earn crores

ఫ్లవర్ బొకే మార్కెట్ చాలా వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందినప్పటికీ, సాంప్రదాయ పూజ పూల మార్కెట్ అంతగా పెరగనట్లు గుర్తించారు. ఫ్లవర్ బోకేల్లో వాడే పూల కంటే కూడా.. సాంప్రదాయ పూలనే ప్రజలు ఎక్కువగా వాడతారనేది గ్రహించారు. కానీ దాని మార్కెట్ మాత్రం ఏమాత్రం బాలేనట్లు గుర్తించారు.మార్కెట్ గురించి క్షుణ్ణంగా పరిశోధన చేసిన తర్వాత, 2019లో, డిమాండ్‌తో పాటు సరఫరా వైపు నుంచి సమస్యను పరిష్కరించే ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, హూవును ప్రారంభించారు. హూవు అంటే కన్నడలో పువ్వులు అని అర్థం. హూవు ద్వారా తాజా పూలను అందిస్తున్నారు అక్కాచెల్లెల్లు. నాణ్యమైన ప్యాకింగ్ తో పూలను డెలివరీ చేస్తున్నారు. దీని వల్ల పూలు 15 రోజుల వరకూ ఏమాత్రం పాడవకుండా ఉంటాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణే, ముంబై, గురుగ్రామ్ మరియు నోయిడా నుండి నెలకు 1,50,000 ఆర్డర్‌లను అందుకుంటున్నారు. గత సంవత్సరం, అగర్బత్తీలను పరిచయం చేయగా… అవి కూడా విజయవంతం అయ్యాయని చాలా ఆనందంగా చెబుతున్నారు ఆ అక్కాచెల్లెల్లు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది