Dairy Farm Business : డైరీ ఫామ్ బిజినెస్.. లాభం లక్షలలో.. వారి ఆలోచనకి అవార్డులు..!
Dairy Farm Business : రైతన్న ఆలోచనలు మారాయి. సరికొత్తగా బిజినెస్ అభివృద్ది చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా డైరీ ఫామ్ యజమాని సుబ్రమణ్యం రెడ్డి చదివింది పదో తరగతే. కానీ ఇతని ఆలోచన విధానం చూస్తే ఎవ్వరైనా సరే సలాం కొట్టాల్సిందే. పరిశ్రమ పెట్టుకోవడానికి పెట్టుబడి లేని స్థితి నుండి 10 మందికి నేడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, నల్లగుట్లపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ, గంగిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి ఉన్న 3 ఎకరాల పొలంలో ఉద్యాన పంటలు సాగు చేసేవారు…

Dairy Farm Business : డైరీ ఫామ్ బిజినెస్.. లాభం లక్షలలో.. వారి ఆలోచనకి అవార్డులు..!
Dairy Farm Business సరైన ఆలోచన..
కష్టించి, శ్రమించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. సరైన గిట్టుబాటు ధరలు లేకుండా వ్యవసాయంలో నష్టాలు చవిచూశారు. వీరికి ఒక్కగానొక్క కొడుకుని పదో తరగతి వరకు చదివించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల చదువులు ఆపివేశాడు. తల్లిదండ్రుల ఆలోచన విధానంతో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి రెండు నాటు ఆవులు కొన్నాడు. వాటిని పొలం పనులకు వాడుకొని దాని ద్వారా వచ్చే పాలతో జీవనం సాగించేవారంట. కొద్దికొద్దిగా జీవనంలో మెరుగైన మార్పులు రావడంతో డైరీ ఫామ్‌ను పూర్తిస్థాయిలో నమ్ముకున్నారు. వారి నివాసం వద్దే పుట్టి పెరిగినవి నేడు 70 ఆవులకు పెరిగాయి.
మొదట్లో పూటకు 4 లీటర్ల పాలు అమ్మిన వేస్తున్న సుబ్రమణ్యం రెడ్డి నేడు 400 లీటర్లు వేస్తున్నాడు. లీటరు ప్రస్తుతం రూ.38 వరకు పడుతున్నది. రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. ఇందులో ఖర్చులకు 7 వేలు పోయినా నెలకు సుమారు 2 లక్షలు మిగుల్తోంది.రూ.30 వేలుతో పెట్టుబడి పెట్టి గడిచిన 20 సంవత్సరాలలోనే సుమారు ఒక కోటి రూపాయలు ఆస్తి సంపాదించాడు. అంతేకాదు వీరు వినియోగిస్తున్న న్యూ టెక్నాలజీని చూసి వ్యవసాయ నిపుణులు అనేక కార్యక్రమాల వేదికగా అవార్డులు అందించారు.