E Shram Card : ఈ-శ్రమ్ కార్డు కలిగి ఉంటే చాలు.. 2 లక్షల బీమా తో నెలకి 3000 రూపాయలు పొందవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

E Shram Card : ఈ-శ్రమ్ కార్డు కలిగి ఉంటే చాలు.. 2 లక్షల బీమా తో నెలకి 3000 రూపాయలు పొందవచ్చు…!

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,8:30 pm

E Shram Card  : మధ్యతరగతి కుటుంబాల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీముల ద్వారా వారిని ఆదుకుంటుంది.. అయితే ఈ పథకాల గురించి చాలామందికి తెలియదు. మరీ ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. అయితే వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు అలాంటి పథకాలు ఉన్నట్టు కూడా జనాలకి తెలియదు. అలాంటి ఓ స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.. దీనిలో చేరితే రెండు లక్షల రూపాయలు వరకు ప్రమాద బీమా తో పాటు ప్రతినెల 3000 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఎంతకు ఆ పథకం ఏంటి దానిలో ఎలా చేరాలో తెలుసుకుందాం… అసంఘటిత రంగంలో మీ కార్మికులు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ యోజనను అమలు చేసింది. దీనిలో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ శ్రమ కార్డు పొందవచ్చు.. దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ స్కీములు అందజేసి సామాజిక భద్రతను కల్పిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శ్రమ కార్డుని జారీ చేస్తున్నాయి. ఇక ఈ కార్డు మీ దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక స్కీములు మీరు అర్హులు అవుతారు. అప్పుడు బీమా సౌకర్యంతో పాటు ప్రతినెలా పెన్షన్ కూడా పొందవచ్చు.

E Shram Card  : ఈ శ్రమ్ కార్డ్

కేంద్రం శ్రామిక కార్డు పేరిట 2021 ఆగస్టులో ఈ పోర్టల్ ను మొదలుపెట్టింది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇక పథకంలో చేరడానికి 16 నుండి 59 వేల వయసున్న వారు అర్హులే నని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టిన ఎన్నో పథకాల ప్రయోజనాలను వారు పొందడానికి వీలుగా రేషన్ కార్డుతో ఈ శ్రమ కార్డును అనుసంధాన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

E Shram Card  : ఈ శ్రమ్ కార్డు కోసం ఎవరు నమోదు చేసుకోవచ్చు

లేబులింగ్, ప్యాకింగ్ కార్మికుల ఇటిక బట్టి కార్మికుల, వలస కార్మికులు, గాయకులు మరియు వడ్రంగి కార్మికులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు చిన్న మరియు సూక్ష్మ రైతులు, ఆశా కార్మికులు, వీధి వ్యాపారులు, పాల ఉత్పత్తి చేసే రైతులు, పట్టు ఉత్పత్తి కార్మికులు, ఆటో డ్రైవర్లు, వార్తాపత్రిక విక్రతలు, మత్స్యకారులు, చర్మకారులు, పోస్టర్ల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు గృహ కార్మికులు తో సహా 150 కంటే ఎక్కువ రకాల కార్మికులు ఈ శ్రమ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు.

E Shram Card ఈ శ్రమ్ కార్డు కలిగి ఉంటే చాలు 2 లక్షల బీమా తో నెలకి 3000 రూపాయలు పొందవచ్చు

E Shram Card : ఈ-శ్రమ్ కార్డు కలిగి ఉంటే చాలు.. 2 లక్షల బీమా తో నెలకి 3000 రూపాయలు పొందవచ్చు…!

E Shram Card  : ఈ శ్రమ్ కార్డు ఉపయోగాలు

-మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే మీరు ఈ శ్రమ కార్డు నెంబర్ ద్వారా కొత్త ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది..
-ఈ శ్రమ్ కార్డు ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ స్కీములను సద్వినియోగం చేసుకోవచ్చు..
-ఈ పోర్టల్ ద్వారా మీకు బీమా కవరేజ్ కూడా ఇవ్వబడుతుంది.
-పాక్షిక వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల వరకు పరిహారం ఇస్తారు..
-ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల బీమా పరిహారం చెల్లిస్తారు..
-దీనిలో పెన్షన్ సిస్టం కూడా ఉంది. మీకు గనక ఈ శ్రమ కార్డు ఉంటే మీకు నెలకు 1000 నుండి 3000 రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు..
దేశంలోని కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ శ్రమ్ పేరుతో ఒక పోర్టల్ ను మొదలుపెట్టింది. ఈ పోర్టల్ కార్మికులకు చాలా సౌకర్యాలు అందిస్తుంది. కార్మికుల ఈ శ్రమ్ పోర్టల్ ను రిజిస్టర్ చేసుకుంటే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న ఈశ్రమ్ కార్డును పొందవచ్చు.. ఈ శ్రమ కార్డు పొందాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి..
[email protected] అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఇక్కడ వీళ్లు అడిగిన వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది..

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది