E Shram Card : మీకు ఈ కార్డు ఉందా.. ప్రతి నెల రూ.3000 పొందవచ్చు… వెంటనే అప్లై చేసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

E Shram Card : మీకు ఈ కార్డు ఉందా.. ప్రతి నెల రూ.3000 పొందవచ్చు… వెంటనే అప్లై చేసుకోండి…!

E Shram Card : కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో ఈ పథకం కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ పేరు ఇ-శ్రామ్ కార్డ్. అవును మీరు ఇ-శ్రామ్ కార్డు కోసం అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెలా రూ.3000 అందించడం జరుగుతుంది. దీని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ ఇ-శ్రామ్ కార్డు అంటే ఏమిటి : మన దేశంలో ఎన్నో పేద కుటుంబాలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  E Shram Card : మీకు ఈ కార్డు ఉందా.. ప్రతి నెల రూ.3000 పొందవచ్చు... వెంటనే అప్లై చేసుకోండి...!

E Shram Card : కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో ఈ పథకం కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ పేరు ఇ-శ్రామ్ కార్డ్. అవును మీరు ఇ-శ్రామ్ కార్డు కోసం అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెలా రూ.3000 అందించడం జరుగుతుంది. దీని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ ఇ-శ్రామ్ కార్డు అంటే ఏమిటి : మన దేశంలో ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఎన్నో కార్మిక కుటుంబాలు మరియు మధ్యతరగతి ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో నివసిస్తూ ఉన్నారు. వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. అంతేకాక బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూడా ఎంతో కృషి చేస్తుంది. ఈ పథకం ద్వారా దరఖాస్తులు చేసుకున్న ఎంతో మంది లబ్ధిదారులకు నెలకు రూ.3000 అందించడం జరుగుతుంది. ఈ అసంఘటిత రంగ కార్మికులు, ఎన్నో పేద కుటుంబాలు మరియు రైతులు కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం యొక్క ప్రయోజనాలను కూడా మీరు పొందొచ్చు. అయితే మన దేశంలో అసంఘటిత రంగ కార్మికులు మరియు పేద కుటుంబాలు ఎన్నో నివసిస్తూ ఉన్నాయి అని చెప్పటం తప్పు కాదు.

కానీ కేంద్ర ప్రభుత్వం వారికి ఇ-శ్రామ్ కార్డు ను ఇవ్వడం వలన లేక ఇ-శ్రామ్ ను ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయడం వలన మరియు అసంఘటిత రంగ కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఇతర సేవలను అందించేందుకు ఈ పోర్టల్ ను అమలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ఆన్ లైన్ చేసుకోవచ్చు. ఈ అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే ఈ కార్డు అనేది జారీ చేయడం జరిగింది. వారిని నిజమైన స్నేహితులు ఇ-శ్రామ్ కార్డు లేక శ్రామిక కార్డు కూడా పిలుస్తారు. అయితే ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రతినెలా కూడా రూ.3000 అనేవి అందించడం జరుగుతుంది. కావున అసంఘటిత రంగంలో పని చేస్తున్నటువంటి కార్మికులు మరియు ఈ లేబర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే దరఖాస్తులను సమర్పించిన తర్వాత కొన్ని నియమాలను కూడా అనుసరించాల్సి ఉంటుంది. వాటిని కూడా చూసుకోండి. అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు 60 ఏళ్ళు పైన ఉండాలి. అప్పుడే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది..

E Shram Card  అసంఘటిత రంగ కార్మికులు అంటే ఎవరు

సంఘటిత రంగంలోని కార్మికులు అనగా వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేసే లేక విక్రయించే సంస్థలలో పని చేసేవారు. అలాగే 10 కంటే తక్కువ మంది కార్మికులు లేక ఉద్యోగులు ఉన్న సంస్థలలో లేక అసంఘటిత సంస్థ లేక అ సంఘటిత రంగ కార్మికులకు రోజువారి వేతానానికి సంబంధించిన కార్మికులను అసంఘటిత రంగ కార్మికుల అని పిలుస్తారు. ఈ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే వారు ఎవరు మరియు మీరు వారిలో ఎవరైనా కూడా అసంఘటిత వర్కర్ అని చెపుతారు. అయితే అసంఘటిత కార్మికులు అని పిలవబడే అర్హత ఎవరికి లేదు అని మేము కింద కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మీరు కూడా అసంఘటిత కార్మికులు అవునా కాదా అనేది కింద ఇవ్వబడిన కొన్ని ఉదాహరణ ద్వారా తెలుసుకోండి…

1.కూరగాయలు అమ్మేవాడు. 2.ప్లాస్టరర్లు.
3.వీధి వర్తకులు.
4.ఆటో డ్రైవర్లు.
5.కూలీలు.
6.వ్యవసాయ కార్మికులు.
7.వేరే వాళ్ళు.

ఈ ఉదాహరణ గమనించిన తర్వాత మీరు కూడా పైన పేర్కొన్న వివరాలకు సంబంధించిన వారు అయితే మీరు కూడా అసంఘటిత రంగ కార్మికుడు అని చెప్పొచ్చు. పైన ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు కాక జీవనోపాధి పొందుతున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నో ఇతర మార్గాలు కూడా ఉన్నాయి..

ఇ-శ్రామ్ కార్డు ఉపయోగాలు

ఈ కార్డును పొందటం వలన మీరు అసంఘటిత రంగంలో వేతన కార్మికులు అయితే 60 సంవత్సరాలు తర్వాత ప్రతి నెల కూడా మీకు రూ.3000 వరకు మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ అనివార్య కారణాల వలన లేక ఊహించని సంఘటన వలన ఎవరైనా వ్యక్తి లేఖ కార్మికుడు ప్రమాదవ శాత్తు చనిపోతే, ఇలాంటి వ్యక్తి కి నామిని రూ. 2 లక్షల మొత్తానికి కూడా అర్హులు అవుతారు. అయితే ఈ ఇ-శ్రామ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి కొన్ని పరిస్థితులు లేక ప్రమాదాల కారణం గా చనిపోయిన లేక వికలాంగులు అయినట్లయితే అలాంటి వ్యక్తికి కూడా రూ. 1లక్ష వరకు ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. ఈ కార్డును కలిగినటువంటి వేతన కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్డు హోల్డర్లకు 12 అంకెల యూనిట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది.

E Shram Card మీకు ఈ కార్డు ఉందా ప్రతి నెల రూ3000 పొందవచ్చు వెంటనే అప్లై చేసుకోండి

E Shram Card : మీకు ఈ కార్డు ఉందా.. ప్రతి నెల రూ.3000 పొందవచ్చు… వెంటనే అప్లై చేసుకోండి…!

దరఖాస్తు చేయడానికి అర్హతలు ఏమిటి : ఈ ఇ-శ్రామ్ కార్డ్ కి కేవలం అసంఘటిత కార్మికులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే ఇ-శ్రామ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వ్యక్తి 18 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 59 ఏళ్లు కంటే తక్కువ వయసు ఉండాలి. అలాగే వేతన కార్మికులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. ఇ-శ్రామ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వ్యక్తికి, కూలీలకు ఆధార్ కార్డు అవసరం. అంతేకాక దరఖాస్తు చేసుకునేందుకు మొబైల్ నెంబర్ ను కూడా ఆధార్ కార్డుకు లింక్ చేయాల్సి ఉంటుంది…

 

ఇ-శ్రామ్ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు అవసరమైన పత్రాలు

1.ఆధార్ కార్డు.
2.రేషన్ కార్డు.
3. ఓటర్ ఐడి.
4.మొబైల్ నెంబర్.
5.లేబర్ కార్డు.
6. బ్యాంకు పాస్ బుక్.
ఈ పత్రలతో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఎలా దరఖాస్తు చేయాలి : మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటున్నారా. అయితే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆన్ లైన్ కేంద్రాన్ని సందర్శించాలి. అలాగే క్రింది ఇవ్వబడిన సైట్ యొక్క లింకును వాడి మీరు అప్లై చేసుకోవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది