E Shram Card : ఇ-శ్రమ్ కార్డ్ ఉంటే చాలు.. నెలకు 3వేల పెన్షన్ 2 లక్షల బీమా కూడా.. ఆన్ లైన్ లో అప్లై చేయాలంటే ఇలా చేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

E Shram Card : ఇ-శ్రమ్ కార్డ్ ఉంటే చాలు.. నెలకు 3వేల పెన్షన్ 2 లక్షల బీమా కూడా.. ఆన్ లైన్ లో అప్లై చేయాలంటే ఇలా చేయండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  E Shram Card : ఇ-శ్రమ్ కార్డ్ ఉంటే చాలు.. నెలకు 3వేల పెన్షన్ 2 లక్షల బీమా కూడా.. ఆన్ లైన్ లో అప్లై చేయాలంటే ఇలా చేయండి..!

E Shram Card : కార్మిక రంగంలో పనిచేసే వారికి సమగ్ర ప్రయోజనాలు అందించే లక్ష్యంగ కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్ యోజన అనే భద్రతా కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఇ-శ్రమ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడం వల్ల కార్మికులు తమ ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వారికి పెన్షన్‌లు, బీమా ఇంకా చాలా రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే ఛాన్స్ ఉంటుంది. వారికి పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు బీమా కవరేజీ ఇంకా అనధికారిక రంగాలలో ఉపాధి పొందుతున్న వారికి కూడా ప్రయోజనం పొందేలా ఈ పథకం రూపొందించబడింది. ఇ-శ్రమ్ కార్డ్ యొక్క అంశాలు ఇంకా అర్హత ప్రయోజనాలు దీన్ని ఎలా దరఖాస్తు చేయాలనేది ఒకసారి చూద్దాం.

ఇ-శ్రమ్ కార్డ్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే కార్మికులకు నెల వారీ పెన్షన్ ఇస్తారు. 60 ఏళ్ల వయసు వచ్చిన వారికి ఇ-శ్రమ్ కార్డ్ హోల్డర్లు నెలకు 3000 దాకా పెన్షన్ అందిస్తారు. అంతేకాదు పదవి విరమణ పొదుపులు, ఇంకా కార్మికులకు ఇది చాలా కీలకంగా ఉంటుంది. దీనితో పాటు బీమా కవరేజ్ ఉంటుని. ఈ పథకం ద్వారా ఇన్సూరెన్స్ 2 లక్షల దాకా మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తారు. అంతేకాదు పాక్షిక వైకల్యం తో బాధపడుతున్న వారికి 1 లక్ష ఆకా ఆర్ధిక సాయం ఉంటుంది. కార్మికుల తో పాటు జీవిత భాగస్వామికి ప్రయోజనాలు అందించేలా ఈ పథకం ఉంది. కార్డుదారుడు మృతి చెందితే అతని జీవిత భాగస్వామి అనుబంధ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఇ-శ్రమ్ కార్డ్ భారత దేశం అంతటా గుర్తింపు ఉంటుంది. కార్మికులు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే ప్రయోజనాలు పొందేందుకు వీలు ఉంటుంది. ఐతే ఇ-శ్రమ్ కార్డ్ డేతాబేస్ వారు అర్హులైన వివిధ ప్రభుత్వ పథకాలకు కూడా స్వీకరించడానికి అనుమతి ఉంది.

E Shram Card ఇ-శ్రమ్ కార్డ్ కోసం అర్హత ఏంటంటే..

ఉపాధిరంగంలో పనిచ్స్తున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికి 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులు. ఆధార్ లింక్ కి మొబైల్ నంబర్ ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లించనివారు దీనికి అర్హులు. ఇక దీనికి దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు చూస్తే.. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

E Shram Card ఇ శ్రమ్ కార్డ్ ఉంటే చాలు నెలకు 3వేల పెన్షన్ 2 లక్షల బీమా కూడా ఆన్ లైన్ లో అప్లై చేయాలంటే ఇలా చేయండి

E Shram Card : ఇ-శ్రమ్ కార్డ్ ఉంటే చాలు.. నెలకు 3వేల పెన్షన్ 2 లక్షల బీమా కూడా.. ఆన్ లైన్ లో అప్లై చేయాలంటే ఇలా చేయండి..!

ఇ-శ్రమ్ కార్డ్ కోసం ఇ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ చేయాలి. ముందు వెబ్ సైట్ లోకి వెళ్లాలి. తర్వాత మొబైల్ నంబర్ ని నమోదు చేయాలి. ఓటీపీ ధృవీకరించాలి. ఆధార్ నంబర్ ని నమోదు చేయాలి. విద్యా ఉపాది వివరాలు ఇవ్వాలి. ఓటీపీ ఇవ్వాలి. ఇ-శ్రామ్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది