BTech Chai : కోవిడ్ వల్ల ఉద్యోగం పోయింది.. దీంతో బీటెక్ చాయ్ పేరుతో టీ స్టాల్ పెట్టి లక్షలు గడిస్తున్న ఇంజనీర్లు
BTech Chai : ఈరోజుల్లో చాయ్ బండి పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అంతో ఇంతో పెట్టుబడి పెట్టి ఒక టీ స్టాల్ పెట్టొచ్చు. కానీ.. దాంట్లో సక్సెస్ రేట్ ఎంత అంటే మాత్రం చెప్పలేం. రోజుకు ఓ 500 నుంచి వెయ్యి వరకు సంపాదించుకోవచ్చు. కానీ.. ఒక టీస్టాల్ తో లక్షలు గడించవచ్చని మీకు తెలుసా? దాన్ని సుసాధ్యం చేసి చూపించారు కేరళకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు.కరోనా వల్ల ఆనంద్ అజయ్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ షనావాస్ అనే ముగ్గురు ఇంజనీర్ల ఉద్యోగం పోయింది. దీంతో కేరళలోని కొల్లమ్ అనే ప్రాంతంలో బీటెక్ చాయ్ పేరుతో ఒక టీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. అది మామూలు టీ స్టాల్ కాదు. అక్కడ 50 రకాల చాయ్ లు దొరుకుతాయి.
రూ.5 నుంచి రూ.45 వరకు రకరకాల చాయ్ లను వాళ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.సాధారణంగా టీ స్టాల్ వద్ద రెండు మూడు రకాల చాయ్ లు మాత్రమే దొరుకుతాయి. కానీ.. బీటెక్ చాయ్ స్టాల్ వద్ద 50 రకాల చాయ్ లు అందుబాటులో ఉండటంతో స్టాల్ పెట్టిన కొన్ని రోజుల్లోనే బాగా పాపులర్ అయింది. కేవలం రూ.1.5 లక్షల పెట్టుబడితో బీటెక్ చాయ్ బండి స్టార్ట్ అయింది.డెయిరీ మిల్క్ చాయ్, బట్టర్ చాయ్, బాదమ్ పిస్తా చాయ్, వనీలా చాయ్, పైనాపిల్ చాయ్, స్ట్రాబెర్రీ చాయ్, చాకొలేట్ చాయ్, మింట్ చాయ్, గింజా చాయ్, సాఫ్రాన్ చాయ్ ఇక్కడ చాలా ఫేమస్.
BTech Chai : రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టి.. బీటెక్ చాయ్ బిజినెస్ స్టార్ట్
గింజా చాయ్ ని 10 రకాల మసాల దినుసులతో తయారు చేస్తారు. ఇది స్పెషల్ మసాలా చాయ్ అన్నమాట.ప్రస్తుతానికి ఈ బిజినెస్ ద్వారా బాగానే లాభాలు వస్తున్నాయి వీళ్లకు. త్వరలో 101 వెరైటీ చాయ్ లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీవితంలో బాగుపడాలంటే ఖచ్చితంగా విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించడమో.. మంచి ఉద్యోగం సంపాదించడమో కాదు.. మన దగ్గర ఉన్న ఐడియాను పెట్టుబడిగా పెడితే చాలు.. ఉన్నచోటే హాయిగా.. ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని నిరూపించారు కేరళకు చెందిన ఇంజనీర్లు.. హ్యేట్సాఫ్.