Farmers : పంట చేతికొచ్చింది. మంచి రేటు కోసం రైతు ఆశగా ఎదురు చూస్తూంటారు. రేటు మాత్రం గిట్టుబాటు కానంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు.. తెగనమ్ముకుని నష్టాలతో రైతు కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. పసుపు రైతు పరిస్థితీ ఇదే.. వారి పంటకు కచ్చితమైన ధర అందించి.. వారి జీవితాలు ఆనందంగా మార్చాడు అమెరికా కుర్రాడు. తమిళనాడు సేలంకు చెందిన కిరు మైక్కపిళ్లై తన స్టార్టప్ ‘ది డివైన్ ఫుడ్స్’ ద్వారా పసుపుతో చేసిన విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తూ.. రైతులకు సిరులు కురిపిస్తున్నాడు.ఇంజినీరింగ్ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత, కిరు 2013లో యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ డార్ట్‌మౌత్‌లో ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లారు. తర్వాత, అతను ఒక అమెరికన్ బ్యాంకులో చేరారు.
“నేను సెలవుల కోసం ఇండియాకి వచ్చినప్పుడల్లా.. నా సొంత బిజినెస్ కోసం ప్లాన్స్ చేస్తుండే వాడిని, మా చుట్టు పక్క ప్రాంతాలు చూస్తూ.. స్థలాల కోసం వెతికేవాడిని. దేశానికి తిరిగి వస్తేనే గానీ.. పని జరగదని అర్థమైంది.. 2018లో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. సేలంలోని నా స్వగ్రామానికి తిరిగి వచ్చాను. వ్యవసాయ ఉత్పత్తులపై వ్యాపారం ప్రారంభించాలని నా ఆలోచన. నేను యుఎస్‌లో ఉన్నప్పుడు, మార్కెట్‌లో నాణ్యమైన ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యవసాయ ఉత్పత్తులను చాలా చూసేవాడిని. ఇక్కడ, బయట దేశాల్లో మన ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉందని అర్థమైంది. సాలెం పసుపు నా వ్యాపారానికి ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. స్థానికంగా ఆర్గానిక్ పసుపు పండించే.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా వారికి మార్కెటింగ్ లో సాయపడ్డాం. ” ”కిరు మైక్కపిళ్లై
డిసెంబర్ 2019లో కిరు ‘ది డివైన్ ఫుడ్స్’ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. యుఎస్ ఉద్యోగం ద్వారా వచ్చిన సంపాదనతో తన స్టార్టప్‌ను ప్రారంభించిన కిరు ఇప్పుడు కోట్లలో టర్నోవర్‌ని అందుకుంటున్నారు.రైతుల నుండి నేరుగా మూలం, కిరు సంస్థ అసమతుల్య మార్కెట్ల వల్ల నష్టపోయిన రైతులకు సహాయం చేస్తుంది. “మేము తమిళనాడులోని స్థానిక సేంద్రీయ రైతులతో సన్నిహితంగా పని చేస్తాం. వారికి స్థిరమైన ధర చెల్లించడం ద్వారా అధిక-నాణ్యత పసుపును కొనుగోలు చేస్తాము. ఉత్పత్తుల నాణ్యత, రకాన్ని బట్టి ధర నిర్ణయించబడుతుంది.” ”అని ఆయన చెప్పారు.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.