Farmers : యూఎస్ లో లక్షలు వచ్చే జాబ్ వదిలేసి.. పసుపు పండిస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : యూఎస్ లో లక్షలు వచ్చే జాబ్ వదిలేసి.. పసుపు పండిస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు

 Authored By aruna | The Telugu News | Updated on :3 February 2022,1:00 pm

Farmers : పంట చేతికొచ్చింది. మంచి రేటు కోసం రైతు ఆశగా ఎదురు చూస్తూంటారు. రేటు మాత్రం గిట్టుబాటు కానంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు.. తెగనమ్ముకుని నష్టాలతో రైతు కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. పసుపు రైతు పరిస్థితీ ఇదే.. వారి పంటకు కచ్చితమైన ధర అందించి.. వారి జీవితాలు ఆనందంగా మార్చాడు అమెరికా కుర్రాడు. తమిళనాడు సేలంకు చెందిన కిరు మైక్కపిళ్లై తన స్టార్టప్ ‘ది డివైన్ ఫుడ్స్’ ద్వారా పసుపుతో చేసిన విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తూ.. రైతులకు సిరులు కురిపిస్తున్నాడు.ఇంజినీరింగ్ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత, కిరు 2013లో యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ డార్ట్‌మౌత్‌లో ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లారు. తర్వాత, అతను ఒక అమెరికన్ బ్యాంకులో చేరారు.

“నేను సెలవుల కోసం ఇండియాకి వచ్చినప్పుడల్లా.. నా సొంత బిజినెస్ కోసం ప్లాన్స్ చేస్తుండే వాడిని, మా చుట్టు పక్క ప్రాంతాలు చూస్తూ.. స్థలాల కోసం వెతికేవాడిని. దేశానికి తిరిగి వస్తేనే గానీ.. పని జరగదని అర్థమైంది.. 2018లో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. సేలంలోని నా స్వగ్రామానికి తిరిగి వచ్చాను. వ్యవసాయ ఉత్పత్తులపై వ్యాపారం ప్రారంభించాలని నా ఆలోచన. నేను యుఎస్‌లో ఉన్నప్పుడు, మార్కెట్‌లో నాణ్యమైన ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యవసాయ ఉత్పత్తులను చాలా చూసేవాడిని. ఇక్కడ, బయట దేశాల్లో మన ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉందని అర్థమైంది. సాలెం పసుపు నా వ్యాపారానికి ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. స్థానికంగా ఆర్గానిక్ పసుపు పండించే.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా వారికి మార్కెటింగ్ లో సాయపడ్డాం. ” ”కిరు మైక్కపిళ్లై

farmers earn double to us uk food helps organic turmeric

farmers earn double to us uk food helps organic turmeric

అమెరికా నుంచి వచ్చాడు.. పసుపు రైతుల ఆదాయాన్ని పెంచాడు..

డిసెంబర్ 2019లో కిరు ‘ది డివైన్ ఫుడ్స్’ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. యుఎస్ ఉద్యోగం ద్వారా వచ్చిన సంపాదనతో తన స్టార్టప్‌ను ప్రారంభించిన కిరు ఇప్పుడు కోట్లలో టర్నోవర్‌ని అందుకుంటున్నారు.రైతుల నుండి నేరుగా మూలం, కిరు సంస్థ అసమతుల్య మార్కెట్ల వల్ల నష్టపోయిన రైతులకు సహాయం చేస్తుంది. “మేము తమిళనాడులోని స్థానిక సేంద్రీయ రైతులతో సన్నిహితంగా పని చేస్తాం. వారికి స్థిరమైన ధర చెల్లించడం ద్వారా అధిక-నాణ్యత పసుపును కొనుగోలు చేస్తాము. ఉత్పత్తుల నాణ్యత, రకాన్ని బట్టి ధర నిర్ణయించబడుతుంది.” ”అని ఆయన చెప్పారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది